‘నీట్’ పరీక్ష వాయిదాకు సుప్రీమ్ కోర్టు ’నో’ అని చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను జరపాలని అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని, అలాగే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు పిటిషన్లు దాఖలు చేయగా, ఈ పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని స్పష్టం చేసింది.