Take a fresh look at your lifestyle.

సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించడం సరికాదు

న్యూదిల్లీ,మే9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో దర్యాప్తు సంస్థలు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావి ంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్‌, ‌నార్త్ అనే వర్గీకరణ తగదని, అన్ని ప్రాంతాల పర్జల మనోభావాలను గౌరవి ంచాలని వ్యాఖ్యా నించింది. అయితే.. ఆయా సంస్థలు ఎందుకు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించాయో, అలా ఎందుకు పిలవాల్సి వచ్చిందో తెలియడం లేదని పేర్కొంది. దేశంలో ఎవరూ సౌత్‌, ‌నార్త్ అన్న వర్గీకరణ చేయరాదని సూచించింది. ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ’సౌత్‌ ‌గ్రూప్‌’, ’‌సౌత్‌ ‌లాబీ’ అని పేర్కొనడాన్ని తప్పుపడుతూ బీఆర్‌ఎస్‌ ‌నేత పటోళ్ల కార్తీక్‌ ‌రెడ్డి సుప్రీంకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. వర్గీకరణ దిశలో ’సౌత్‌ ‌గ్రూప్‌, ‌సౌత్‌ ‌లాబీ’ అని ప్రస్తావించడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి భాష ఉపయోగించకూడదని దర్యాప్తు సంస్థల్ని ఆదేశించాలని కార్తీక్‌ ‌రెడ్డి తన పిటిషన్‌ ‌లో కోరారు. దర్యాప్తు సంస్థలు వాడుతున్న భాష దేశంలో వర్గీకరణకు దారితీసేలా ఉందని కార్తీక్‌ ‌తరపు అడ్వొకేట్‌ ‌వాదనలు కొనసాగించారు. అయితే.. ఈ పిటిషన్‌ ‌పై జోక్యం చేసుకోబోమన్న బెంచ్‌.. ‌కార్తీక్‌ ‌రెడ్డి తన పిటిషన్‌ ‌కాపీలను రిప్రజంటేషన్‌ ‌రూపంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని సూచించింది. ఇకపై దర్యాప్తు సంస్థల తీరుపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని విచారణ ముగించింది.

Leave a Reply