Take a fresh look at your lifestyle.

సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియంలో కేంద్రానికి చోటు

న్యూ దిల్లీ, జనవరి 16 : సుప్రీమ్‌ ‌కోర్టు కొలీజియమ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈమేరకు సోమవారం కిరణ్‌ ‌రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్‌లో పారదర్శకత మరియు జవాబు దారీతనం కోసం ప్రభుత్వ ప్రతినిధులను కలిగి ఉండాలని భావిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.

హైకోర్టు కొలీజియంలో కూడా రాష్ట్ర ప్రతినిధులు భాగం కావాలని కోరుకుంటున్నట్లు రిజిజు తెలిపారు. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి మధ్య మాటల యుద్ధం కొనసాగు తున్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థలో అపారదర్శకత నెలకొం దంటూ ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖర్‌ ‌సహా పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply