Take a fresh look at your lifestyle.

రేపు యాదాద్రికి సుప్రీమ్‌ ‌కోర్టు సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ

  • గవర్నర్‌ ‌తమిళ సై, సిఎం కెసిఆర్‌లు కూడా రాక
  • దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
  • భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్‌ ‌యంత్రాంగం

సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం యాదాద్రిని సందర్శించనున్నారు. ఆయనతో పాటు గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌లు సైతం యాదాద్రికి వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వొస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నది. యాదాద్రి పునర్నిర్మాణ పనులను జస్టిస్‌ ఎన్వీ రమణకు, గవర్నర్‌ ‌తమిళ సైకి సిఎం కెసిఆర్‌ ‌వివరించనున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సిఎం కెసిఆర్‌ ‌మరోమారు పనులను పరిశీలించి, సిజెకు కూడా నిర్మాణ పనుల విశేషాలను స్వయంగా వివరించనున్నారు.

మూడు నెలల వ్యవధి తర్వాత సిఎం కెసిఆర్‌ ‌యాదాద్రికి వొస్తున్నా..గవర్నర్‌, ‌సిజెతో పాటు రావడం ఇప్పుడు ప్రత్యేకతగా చూడాలి. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా కొండ కింద నిర్మిస్తున్న పుష్కరిణికి ఎలిఫెంట్‌ ‌ప్యానల్‌ ‌నిర్మాణంతో ఆధ్యాత్మిక సొబగులను దిద్దుతున్నారు. విస్తరణ పనుల్లో భాగంగా కొండకింద గండిచెరువు సవి•పంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద స్నానగుండాన్ని నిర్మిస్తున్నారు. పుష్కరిణి నిర్మాణం పూర్తిగా ఆధ్యాత్మికత ఉట్టి పడేవిధంగా ఆర్‌సీసీలో అద్భుత శిల్పకళా సంపదను పొందుపరుస్తూ నిర్మిస్తున్నారు. ఈ పనులను తాజాగా సిఎం కెసిఆర్‌ ‌పరిశీలించనున్నారు. సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా యాదాద్రి పనులను పరిశీలించాలన్న ఉత్సుకతతో ఉన్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply