- భక్తులు లేకుండా రథయాత్రకు కూడా వీల్లేదన్న కోర్టు
- కొరోనా వేళ అనుమతిస్తే దేవుడూ క్షమించడని వ్యాఖ్య
ఈ యేడాది పూరీ జగన్నాథుని రథయాత్రను అశేష భక్తజనం లేకుండానే నిర్వహిస్తామని మే నెలాఖరున శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.. ఆలయ కమిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒడిశా సర్కార్…. రథయాత్ర సందర్భంలో ప్రత్యేకంగా రైళ్లు వేయాల్సిన అవసరం ఏ లేదని కేంద్ర రైల్వే శాఖకు తేల్చి చెప్పింది. లక్షలాది భక్తుల వీక్షణార్థం అన్ని డియా ఛానళ్లలోనూ రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అప్పుడు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వివిధ పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే రథను నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రథయాత్రపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే అని ఆలయ కమిటీ అధ్యక్షుడు గజపతి మహారాజా అన్నారు. కాగా.. భక్తులు లేకుండా రథయాత్రను నిర్వహించేందుకు కూడా తాజాగా సుప్రీం కోర్టు నో చెప్పింది.. సుప్రీం తీర్పును బట్టి శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ఏం చేయబోతోందో వేచిచూడాలి.