Take a fresh look at your lifestyle.

అడవి బిడ్డలకు అండగా..

  • కొరోనా వైరస్‌ ‌విస్తరణ, నివారణపై అవగాహన కల్పిస్తూ సీతక్క అలుపెరగని సేవలు.!
  • ప్రశంసలు పొందుతున్న ములుగు ఎమ్మెల్యే 

దేశ దేశాలను గజగజ వనికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు గత మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించి వెనువెంటనే లాక్‌డౌన్‌ ‌విధించడంతో ప్రజలంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా నేను మీకు అండగా ఉంటానని తన ప్రయాణం మొదలు పెట్టిన గిరిజన మహిళ, కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ(సీతక్క) జిల్లాలోని అనువనువును జల్లెడపడుతూ ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెలో తిరుగుతూ వలస కూలీలు, నిరుపేదలను, గిరిజన కుటుంబాలని ఆదుకుంటు కరోనా వైరస్‌ ‌మహమ్మారీ వలన కలుగు కష్టాలను వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిరంతరం ప్రజలకే అంకితమైన నాయకురాలిగా పేరొందింది. ప్రజల,నిరుపేదల సమస్యలను అడుగుకుంటు కష్టకాలంలో మీకు అండగా ఉంటానని హామీలు ఇస్తు ప్రతి ఇంటింటికి తిరుగుతూ తనదైన శైలిలో తనకు తోచిన రీతిలో నిత్యావసర సరుకులను, అన్నదానాలను కార్యకర్తల అండదండలతో అందిస్తున్నారు. జిల్లాలోని అధికారులను నిత్యం కలుస్తు వారికి అనేక సూచనలు చేస్తు ప్రతి రోజు కోన్ని గ్రామాల చొప్పున తిరుగుతూ అనేక పల్లేలను,అక్కడ నివసిస్తున్న నిరుపేదలను కలుస్తున్నారు. ఏజేన్సీ గ్రామాలలో నిరుపేదలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉందని, దీనిని గమనించిన సీతక్క నిత్యం పల్లేలలోనే జీవనం గడుపుతూ ఎవరికి ఏమి కావాలో అందిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలలను తనదైన శైలిలో చుట్టేస్తూ గిరిజనులతో జీవనం సాగిస్తూ అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది.

అదివాసీల వారికి ప్రస్థుత లాక్‌డౌన్‌పై అవగాహన కల్పిస్తు దీని వలన దేశ దేశాలు సర్వనాశనం అవుతున్నాయని, మనం కేవలం లాక్‌డౌన్‌లో అధికారులు సూచించిన వాటిని పాటించుతూ సామాజిక దూరం పాటించాలని పల్లెప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అవసరమైతే తప్పా ఇంటి నుండి బయటికి రావద్దని సూచిస్తున్నారు. 20 రోజులుగా జిల్లాలోని అటవి ప్రాంతాలలోనే జీవనం సాగిస్తు ప్రజలతో మమేకమై పోతున్నారు. లాక్‌డౌన్‌ అం‌టే తెలియని సామాన్య ప్రజలకు అతికొద్ది కాలంలోనే దాని గురించి తెలియజేస్తు దానిని పాటించేలా చేసిన ఘనత సీతక్కకే దక్కింది.నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహించుకుంటు ప్రజలకు దైర్యం చెప్పుకుంటు పోతున్నారు. కనీసం రోడ్డు మార్గం సైతం లేని కోన్ని ప్రాంతాలకు కాలి నడకన దాదాపు 10 కిలోమీటర్లు సైతం నిడిచి వెల్లి అక్కడి గ్రామాల కూలీలకు నిత్యావసర సరుకులు అందించిన ఘనత సీతక్కదేనని స్థానికులు కోనియాడుతున్నారు.

కోన్ని ప్రాంతలకు ట్రాక్టర్‌పై వెల్లి నిరుపేదలకు బియ్యం,పప్పు,నూనే,కూరగాయలు,ఉప్పు తదితర సరుకులను అందించారు. దేశంలో కరోనా వైరస్‌ ‌చాపకింద నీరులా ప్రవహిస్తున్నదని, రోజు రోజుకు వైరస్‌ ‌సోకిన సంఖ్య పెరిగి పోతున్నా లెక్కచేయకుండా నియోజకవర్గం మొత్తం కలియ తిరిగారు. జిల్లాలోని కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ‌ములుగు, ఏటూరునాగారం, కోత్తగూడ,గంగారాం మండలాల్లోని ప్రతి గ్రామానికి సరుకులు అందించారు. కరోనాపై నిత్యం అలుపెరుగని పోరాటాలు చేస్తు ఏజేన్సీ ఆమాయక ప్రజలకు నేను ఉన్నానని భరోసా ఇస్తున్నారు.స్వీయ నిర్భందం పాటించి కరోనా వైరస్‌ను తరిమి కోట్టాలని ప్రజలకు పిలుపు నిస్తున్నారు. ఇంత సమయంలో ఇన్ని గ్రామాలు చుట్టేసిన ఘనత,పేరు సీతక్కకే వచ్చిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

Leave a Reply