Take a fresh look at your lifestyle.

వయోధికులను ఆదుకోండి

మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చేపట్టిన ‘‘మేక్‌ ఇన్‌ ఇం‌డియా’’, ‘‘స్వచ్చ్ ‌భారత్‌’’ ‘‘‌డిజిటల్‌ ఇం‌డియా’’ మొదలగు ప్రయత్నాలలో విజయం సాధించాలని వయోదికులమైన మేము ఆశించినాము. అన్ని జాతీయం చేయబడిన బ్యాంకుల యొక్క SCSS (సీనియర్‌ ‌సిటిజన్‌ ‌సేవింగ్స్ ‌స్కీమ్‌) ‌పై కనీసం 10 శాతం వరకు వడ్డీని చెల్లించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.  ప్రస్తుతం 7.25 శాతం చెల్లిస్తున్నారు. త్రైమాసికానికి చెల్లించాల్సిన వడ్డీ నెలవారీగా చెల్లించాలి. పరిమితిని 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచండి.సీనియర్‌ ‌సిటిజన్లు తమ పిల్లలపై ఆధారపడకుండా స్థిరమైన ఆదాయంగా రూ. 22000 నెలవారీ వడ్డీని పొందగలుగుతారు.  ఈ ఆదాయంపై పన్ను తీసివేయండి మరియు ఫారమ్‌ 15H ‌మొదలైన వాటిని సమర్పించే నిబంధనను తీసివేయాలి. పెట్టుబడి కాలం 15 సంవత్సరాలకు పొడిగించాలి. ప్రస్తుత మనిషి జీవితకాలం 75 మరియు అంతకంటే ఎక్కువ పెరిగింది. ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు వడ్డీరేట్లను ఎప్పటికీ తగ్గించకూడదు  పెంచకూడదు అనే నిబంధనను ఈ పథకానికి వర్తింప చేయాలి.

సీనియర్‌ ‌సిటిజన్స్ ఆదాయం పది లక్షల కంటే తక్కువ ఉంటే రిటర్న్లు దాఖల నుండి మినహాయింపు చేయాలి. అధార్‌ ‌కార్డు అనుసంధానంతో  సీనియర్‌ ‌సిటిజన్లకు మందులను  దేశవ్యాప్తంగా ఔషధాల ధరలో 60 శాతం తగ్గించి ఇవ్వాలి. అదే విధంగా అన్ని రకాల పరీక్షలను చికిత్సలు మరియు ఆపరేషన్లు నామమాత్రపు రుసుములతో అందించాలి. 30 నుండి 40 సంవత్సరాలు పనిచేసినా, తగువిధమైన పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌దొరకని చోట, కాస్త గౌరవంగా జీవించుటకు  చేయూతనివ్వాలి.  మేము యవ్వనంలో కష్టపడి పని చేసినము కాబట్టి ముఖ్యంగా వైద్య ఖర్చులలో మినహాయింపు కోరుతున్నాము. దేశంలో పరిశ్రమలకు స్థాపించే వారికి అనేక రాయితీలు కురిపిస్తున్నారు తద్వారా దేశంలో ఉత్పత్తి ఉత్పాదన పెరిగి నిరుద్యోగం నిర్మూలించబడుటకు దారులు కల్పిస్తున్నారు. అదేవిధంగా మేము దేశానికి చేసిన సేవలకు ప్రతిఫలంగా మాకు కూడా అన్ని రంగాలలో తగు రాయితీలు కల్పించి గౌరవంగా బతుకుటకు చేయూతనివ్వాలి . ఏ రాజకీయ పార్టీ అయినాఅధికారంలో కొనసాగడానికి  మా ఓట్లు అవసరమని తెలుసుకోవాలి.

భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక ముఖ్యమైన ప్రమాణం.  ఆలోచనా విధానం మారుతోంది  మరియు ప్రస్తుత దయనీయ స్థితికి సీనియర్‌ ‌సిటిజన్లు బాధతప్త హృదయముతో ఆవేదన చెందుతున్నాము. ఇది వినయపూర్వకమైన అభ్యర్థన మరియు వెంటనే తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాము. మరియు సీనియర్‌ ‌సిటిజన్లకు ఉపశమనం కలిగించడానికి మరియు మా నిద్రలేని రాత్రులను తగ్గించడానికి మీరు మా సూచనలను వీలైనంత త్వరగా అమలు చేస్తారని ఆశిస్తున్నాము.  మిమ్మల్ని కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు, మేము శాంతియుతంగా మరియు గౌరవంగా జీవించాలనుకుంటున్నాము. గాలి వాగ్దానాలతో బతకకుండా తమ విలువైన ఓట్లను వేసే ముందు అందరూ గమనించాలి. ముందు ముందు ప్రభుత్వాలు సీనియర్‌ ‌సిటిజన్స్ ‌ను గౌరవంతో చూస్తూ అన్ని రకాల సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాము.
– దండంరాజు రాంచందర్‌ ‌రావు, రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌, ‌సింగరేణిభవన్‌, ‌హైదరాబాద్‌, 9849592958

Leave a Reply