Take a fresh look at your lifestyle.

కోదండరామ్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి రాజకీయ పార్టీలకు టీజేఎస్‌ ‌లేఖలు

నల్గొండ- వరంగల్‌- ‌ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ఆపార్టీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌, ‌టీడీపీ, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్‌ ‌లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాలను అందజేసింది.  ఈ మేరకు ఇప్పటికే టీపీసీసీకి, ఏఐసీసీకి టీజేఎస్‌ ‌లేఖలు అందజేసింది. తాజాగా, శుక్రవారం టీజేఎస్‌ ‌పొలిటికల్‌ ఎఫైర్స్ ‌కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, పార్టీ నేతలు ధర్మార్జున్‌, ‌బైరి రమేశ్‌, శ్రీ‌శైల్‌రెడ్డి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.‌రమణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలకు విజ్ఞాపన పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్‌ ‌రాజకీయాలకు ఉద్యమ సారథి అయిన కోదండరామ్‌ ఎమ్మెల్సీగా గెలుపొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని పేర్కొన్నారు. కోదండరామ్‌ ఎమ్మెల్సీగా గెలిస్తే యువత, నిరుద్యోగులకు మండలిలో సరైన విధంగా ప్రాతినిద్యం వహిస్తారనీ, ఈ విశాల ప్రయోజనాల దృష్ట్యా కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలని నేతలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన సాగుతున్న నేపథ్యంలో మేధావి, తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపించి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కోదండరామ్‌ ‌తప్పనిసరిగా గెలవాలనీ, అప్పుడు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను చట్ట సభలలో గొంతెత్తి ప్రశ్నించే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply