Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు మద్ధతు

ప్రకటించిన పారామెడికల్‌, ‌వొకేషనల్‌ ‌కాలేజి మెనేజ్మెంట్‌ అసోషియేషన్‌ ‌ప్రతినిధులు.
ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావును కలిసి అసోషియేషన్‌ ‌తీర్మాన ప్రతిని అందజేసిన ప్రతినిధులు.
మద్ధతు తెలిపినందుకు అభినందించిన మంత్రి హరీశ్‌ ‌రావు.

హైదరాబాద్‌ – ‌రంగారెడ్డి- మహబూబ్‌ ‌నగర్‌, ‌ఖమ్మం-నల్గొండ- వరంగల్‌ ‌పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకే తమ మద్ధతునిస్తున్నట్లు తెలంగాణ పారామెడికల్‌ ‌కాలేజ్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ అసోషియేషన్‌, ‌వొకేషనల్‌ ‌కాలేజ్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌ అసోషియేషన్‌ ‌ప్రతినిధులు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌ ‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావును కలిసి ఈ మేరకు అసోషియేషన్‌ ‌కమిటీలు తీర్మానం చేసిన మద్దతు లేఖను అన్ని జిల్లాల కమిటీ నేతలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్‌ ‌ప్రతినిధులు మంత్రి హరీశ్‌ ‌రావుతో మాట్లాడుతూ పారామెడికల్‌, ‌వొకేషనల్‌ ‌విద్యాసంస్థలు మూసివేసుకునే పరిస్థితుల్లో తమకు ప్రభుత్వం ఇచ్చిన మద్ధతు మాటల్లో చెప్పలేదనిదన్నారు. అన్ని విధాలా ఆదుకున్నందుకు కృతజ్ఞతగా తమను అడగకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎస్‌. ‌వాణి దేవికి మద్ధతు ఇవ్వాలని తమ అసోషియేషన్‌ ‌కమిటీ తీర్మానించినట్లు చెప్పారు.

చేసిన సాయం మరిచిపోయే ఈ రోజుల్లో మీరు గుర్తుపెట్టుకుని మరీ అడగకున్నా మద్ధతు తెలపడం అభినందనీయమని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ఉందన్నారు. విద్య, ఉపాధి, సాగు నీరు, సంక్షేమం ఇలా ఎ రంగం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా నిలిచిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనలోను తెలంగాణ ముందు ఉందని మంత్రి హరీశ్‌ ‌రావు వారికి వివరించారు. కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే అక్కడ కేవలం ఐదు గంటలు మాత్రమే విద్యుత్‌ ‌సరఫరా ఉంటుందని, అదీ ప్రతీ పది నిముషాలకు ఒక సారి కోతలు విధిస్తూ.. విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నట్లు అక్కడి ప్రజలే తనకు చెప్పారన్నారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం తాము 18 గంటల పాటు విద్యుత్‌ ‌సరఫరా చేస్తామని, పరిశ్రమలు పెట్టండంటూ.. మీడియాలో అడ్వర్టైజ్‌ ‌మెంట్స్ ఇస్తోందన్నారు.

కాని తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు, రైతులకు, గృహావసరాలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రభుత్వం దాన్ని 16,249 మెగావాట్లకు పెంచిదని చెప్పారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచితి విద్యుత్‌ ఇస్తున్నామని ఇలా మరే రాష్ట్రం దేశంలో ఇవ్వడం లేదని మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో తాగు నీరు, విద్యుత్‌, ‌రైతు సమస్యలపై గొడవలు జరుగుతున్నాయన్నారు. కాని తెలంగాణలో మాత్రం ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి పత్రికల్లో ప్రతీ రోజు రైతుల ఆత్మహత్యల వార్తలే.

కాని తమ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమైన అంశంగా భావించి.. వా రికి కావల్సిన సాయం అన్న విధాలా అందించాన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, నకిలీ విత్తనాలు బెడద తొలగింపు, ఎరువుల కొరత లేకుండా చూశామన్నారు. పండించిన పంటకు మద్ధతు ధర ఇచ్చామని.. ఈ చర్యలతో నేడు రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. చేసిన మేలును మర్చిపోయే ఈ రోజుల్లో.. తమ ప్రభుత్వం పారామెడికల్‌ ‌కళాశాల, వొకేషనల్‌ ‌కళాశాలల సమస్యలను పరిష్కరించినందుకు గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్ధతు తెలపడం అభినందనీయమన్నారు. మీ ఓట్లతో పాటు సభ్యులు, ఓటు హక్కు ఉన్న విద్యార్థులు, బంధువులతోను తెరాస అభ్యర్థులకు ఓటు వేయించాలని మంత్రి హరీశ్‌ ‌రావు వారిని కోరారు. ఓటింగ్‌ ‌శాతం పెరిగేలా చూడలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారామెడికల్‌ ‌కాలేజ్‌ ‌మేనేజ్మెంట్‌ అసోషియేషన్‌ ‌గౌరవా అధ్యక్షులు మోహన్‌ ‌రెడ్డి, అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ధారా సింగ్‌, ‌చీఫ్‌ అడ్వైజర్‌ ‌విజయ రవీందర్‌, ఉపాధ్యక్షులు జహంగీర్‌ ‌పాషా, జాయింట్‌ ‌సెక్రటరీలు డెవిడ్‌, ‌సోమ మల్లన్న పాల్గొన్నారు.

Leave a Reply