Take a fresh look at your lifestyle.

మట్టి పిడికిళ్లకు మద్దతు !

బువ్వ పూలు పూయించిన
చెమట చుక్కల చేతులెవరివి?

పంట చేలకు ప్రాణం పోసిన
బురద మట్టి దేహాలెవరివి?

ఎరువాకకు రక్తం పారించింన
మసకబారిన ఎడలెఎవరివి?

దేశానికి ఇరుసుగా నిలిచిన
వంగిన వెన్నెముక లెవరివి?

వాళ్ళెవరో తెలియదు
రక్త సంబంధికులు కారు
ఏమి కానీ వాళ్ళు మాత్రం
మనకు మెతుకు ఇచ్చేందుకు
బతుకులు దారబోస్తున్నారు.

కాలం కక్షగట్టికన్నెర్రజేసినా
వైపరీత్యాలు ముంచేసినా…
నమ్మిన నేలను వదలకున్నడు.
సాయపు గుణం మరవనన్నడు.

దేవుణ్ణి మదిల తలుస్తాం సరే!
మరి బతుకు నిలబెట్టే మనిషిని
ఒక్కసారి యాది జెయ్యకుంటే ఎట్లా?

కన్న ‘‘రుణం’’ తీర్చుకుందాం పర్లే!
మరి తిన్న ‘‘రుణం’’ విస్మరిస్తే సభబా ?

బువ్వ పెట్టె రైతన్న ఇపుడు
నల్ల చట్టాల రద్దుకు గళమెత్తిందు..

ప్రాణాలు తృణప్రాయంగా తలచి
ఢిల్లీ వీదుల్లో పోరు సాగిస్తున్నడు.
ఇకనైనా మనవంతుగా…
ఆ మట్టి పిడికిళ్లకు సత్తువ కలబోద్దాం
ఆ ధిక్కార గళాలకు స్వరం కలుపుదాం
ఆ ధర్మ పోరుకు మద్దతుగా కదులుదాం
కర్షక యోధునికి విజయం కట్టబెడుదాం

ఢిల్లీలో రైతు
ఉద్యమానికి మద్దతుగా….                     – కోడిగూటి తిరుపతి,  9573929493

Leave a Reply