Take a fresh look at your lifestyle.

సరిపడా వ్యాక్సిన్‌ ‌సరఫరా చేయండి

  • రేమిడిసివర్‌ను సత్వరమే అందుబాటులో ఉంచండి
  • రెండో టీకా తీసుకున్నమంత్రి జగదీష్‌ ‌రెడ్డి

కోవాక్సిన్‌, ‌కోవిషీల్డ్ ‌టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్‌ ‌శ్రీనివాసరావును రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి ఆదేశించారు. ఉన్నఫలంగా టెస్ట్ ‌కిట్లను పెంచడంతో పాటు, పంపాలని ఆయన సూచించారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఆయన కరోనా టీకా రెండో డోస్‌ను తీసుకున్నారు. అనంతరం అదే ఆసుపత్రిలో కోవిడ్‌ ‌బారిన పడి చికిత్స పొందుతున్నవారితో వీడియో కాన్ఫరెన్స్ ‌లో మాట్లాడి బాగోగులు తెలుసుకోవడంతో పాటు, ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారు. అదే సమయంలో అక్కడి నుండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో సంభవిస్తున్నపరిణామాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా డియంహెచ్‌ఓలతో ఆయన ఫోన్‌లో సమీక్షించారు. డియంహెచ్‌ఓలు అందించిన సమాచారంతో అక్కడి నుండే నేరుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్‌ ‌శ్రీనివాసరావుతో మాట్లాడి సరిపడా వ్యాక్సిన్‌ను సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా హెటిరో యండితో ఫోన్‌లో సంప్రదించి తగినంత రేమిడిసివర్‌ను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్నఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ను స్వయంగా ఆయన పరిశీలించారు. కోవిడ్‌ ‌పేషంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ‌లో మాట్లాడుతూ పాజిటివ్‌ అని తెలవనే పరేశాన్‌ ‌కావొద్దని సూచించారు. భయాందోళననే మనిషిని ఆగం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. మానసిక ధైర్యమే కరోనాపై విజయానికి మందు లాగా పనిచేస్తుందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్ల బంధువులతో ఏరియా ఆసుపత్రి బయట మాట్లాడిన మంత్రి జగదీష్‌ ‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

Leave a Reply