Take a fresh look at your lifestyle.

సూపర్‌ ‌స్ప్రెడర్స్ ‌పట్ల అప్రమత్తం కావలి ..!

థర్డ్ ‌వేవ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ఐఎమ్‌ఏ
కోవిడ్‌ ‌మహమ్మారి రెండవ వేవ్‌ను కట్టడి చేయడంలో, క్రమంగా స్థిరపడటంలో ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌చురుకైన పాత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడవ వేవ్‌పై అప్రమత్తం చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ..అంచనాల దృష్ట్యా, నివారణ అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరింది. 24 దేశాల నివేదికల ప్రకారం థర్డ్ ‌వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పేర్కొంది. సూపర్‌ ‌స్ప్రెడర్స్, ‌సినిమా హాల్స్, ఎ/‌సి డైనింగ్‌ ‌హాల్స్, ‌పబ్బులు, బార్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ .. ప్రజల ప్రయోజనార్థం వాటిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది.

జనాభాలో ఎక్కువ మంది టీకాలు వేసేలా చూడటానికి టీకా డ్రైవ్‌ను కాల వ్యవధిలో తీవ్రతరం చేయడానికి ప్రయత్నించాలని తెలిపింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో, మాస్క్ ‌ధరించడం మరియు శారీరక దూరం అవగాహన పట్ల మీడియా అందించిన మద్దతును ఈ సందర్బంగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాలలో మద్దతు ఇవ్వడానికి ఐఎమ్‌ఏ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ప్రెసిడెంట్‌ ‌డాక్టర్‌ ‌డి లవకుమార్‌ ‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ ‌బి నరేందర్‌ ‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్ ‌డాక్టర్‌ ఎం ‌సంపత్‌ ‌రావు, డాక్టర్‌ ‌బిఎన్‌ ‌రావులు ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply