Take a fresh look at your lifestyle.

నిప్పుల కొలిమిలా…. దంచికొడుతున్న ఎండలు..

ఎండలు దంచి కొడుతున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని ఆయా ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 6గంటల నుంచే సూర్యుడు భగభగ మంటూ నిప్పులు చిమ్ముతూ వస్తున్నాడు. రోహిణి కార్తెలో రో(కళ్లు)ళ్లు పగిలేలా ఎండలు కొడుతాయంటారు. పెద్దలు సామెత చెప్పినట్లుగా ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. ఈదురు గాలులతో ప్రజలు ఇండ్ల నుంచి రావాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా వణుకుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో 44 డిగ్రీల వకు సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా…మంగళవారం మధ్యాహ్నం 41డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి కొన్ని రోజుల పాటు ఎండ తీవ్రత, వడగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..తెలంగాణ నిప్పుల గుండంగా మారింది. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తోడు వడ గాలులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో సిద్ధిపేటలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోహిణి కార్తె ఎండలు బండలు పగిలేలా దంచికొడుతున్నాయి. వడదెబ్బకు తగిలి జనం గజగజ వణికిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకి రావొద్దని హెచ్చరించారు. ఎండ వేడికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగాయి. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు, చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు.

Leave a Reply