Take a fresh look at your lifestyle.

ఆదివారం గణేశ్‌ ‌నిమజ్జనం..శోభా యాత్ర

  • భారీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
  • ట్యాక్‌బండ్‌పై నిమజ్జనంపై అధికారుల సవి•క్ష

సుప్రీమ్‌ ‌కోర్టు ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాలకు అనుమతినిస్తూ తీర్పు నివ్వడంతో గణేశ్‌ ‌నిమజ్జన ఏర్పాట్లకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఆదివారం జరుగనున్న శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్‌ ‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పరిసరాలలో 24 క్రేన్‌లతో పాటు జీహెచ్‌ఎం‌సి పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన పలు రిజర్వాయర్‌లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ ‌వద్ద మొత్తం 300 క్రేన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 100 మంది గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

మండపాల నిర్వహకులకు విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు జీహెచ్‌ఎం‌సి పరిధిలోని 10 పాయింట్స్ ‌లలో అందుబాటులో ఉంచుతూ, వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్‌ ‌లను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ ‌తీగలను, చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. ట్రాపిక్‌ ‌పోలీసు, ఆర్‌అం‌డ్‌ ‌బి శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి శోభాయాత్ర కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాహన దారులు, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్‌ ‌డైవర్షన్‌ ‌చేస్తున్నారు.

అవసరమైన ప్రాంతాలలో మొబైల్‌ ‌టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎం‌సి అధికారులను ఆదేశించారు. గణేష్‌ ‌విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్‌ ‌వైజర్‌ ‌లేదా ఎస్‌ఎఫ్‌ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. శోభాయాత్ర, నిమజ్జనం  ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్‌ ‌దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్‌, ‌ఖైరతాబాద్‌, ‌సంజీవయ్య పార్క్, ‌జేమ్స్ ‌స్ట్రీ, ‌బేగంపేట రైల్వే స్టేషన్‌ ‌ల నుండి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్‌ ‌రైళ్ళను నడపనునున్నారు.

Leave a Reply