Take a fresh look at your lifestyle.

నిప్పుల కొలిమిలో ‘పేట’

సూర్యాపేట, మే 26, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా సూర్యాప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలు. వడగాల్పులతో భానుడు ఉగ్ర రూపానికి ప్రజలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఒక ప్రక్క రెండు నెలల నుండి కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలు దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలించడంతో రోడ్లపైకి వద్దామని  అనుకున్న రోజు రోజుకు ఉష్ణోగ్రత 46డిగ్రీల వరకు నమోదు కావ డంతో జిల్లాలో ఉదయం 9గంటల నుండి ఎండతోపాటు ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రాత్రి పూట కూడా వేడి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడు తున్నారు. ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రోహిణి కార్తీ రావడంతో ఎండతీ్ర వత ఎక్కువగా ఉన్నది. ఒక ప్రక్క వాతవా రణ కేంద్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎండలో తిరగవొద్దని హెచ్చరిస్తున్నారు.
మరిముఖ్యంగా వృద్దులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు, చిరువ్యాపారులు రోజంతా కష్టపడితేనే వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఉంటుందని వారు వాపోతున్నారు. ఒకప్రక్క కరోనా, మరోక ప్రక్క ఎండ తీవ్రత మమ్ములను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.రోజు రోజుకు ఉష్ణోగ్రత రికార్డు స్థాయి లో నమోదు కావడంతో ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. భానుడి భగభగతో పట్టణాలు అన్ని నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం ఉంటేనే ప్రజలు ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 6గంటల తరువాత ఎండ తీవ్రత తగ్గిన తరువాతే బయటకు రావాలని డాక్టర్లు, వాతావరణ శాఖ చూసిస్తుంది. లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో సాయంత్రం 5గంటల నుండి ఉదయం 7గంటల వరకు కర్క్ఫూని విధించడంతో ప్రజలు ఎండ సైతాన్ని లెక్కచేయకుండా తమ పనిని ముగించుకోవాలని, ఎండల్లో తిరుగుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్రక్క ప్రాణాంతకమైన కరోనా, మరో ప్రక్క ఎండ తీవ్రతతో ప్రజల్లో తెలవని భయాందోళన కన్పిస్తుంది. ముందు పోతే నుయ్యి వెనుకబోతే గోయ్యి అనే చందంగా మనిషి జీవన శైలి ప్రస్తుతం నెలకొంది. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా రెండు నెలలు ఇంటికే పరిమితమై కుటుంబాలనే పోషిం చలేని తరుణంలో ఎండ తీవ్రత మరింత కృంగదీస్తుందని వాపోతున్నారు. ఏదీ ఏమీ అయినా మహమ్మారి కరోనా వైరస్‌ ‌నుండి జాగ్రత్త పడుతు ప్రకృతి పరంగా ఎండతీవ్ర తతో తమకు తామే ప్రాణరక్షణ చేసుకో వాల్సి ఉంటుందని పలువురు మేధావులు చెప్తున్నారు.
తీవ్ర ప్రభావం చూపుతున్న రోహీణీకార్తె ఎండలు
ఖమ్మం సిటి, మే 26 (ప్రజాతంత్ర విలేకరి) : నిన్నగాక మొన్న రోహిణీ కార్తె ప్రవేశిం చిందో లేదో ప్రారంభం నుండే భానుడు ప్రచండుడై తన ప్రభావాన్ని చూపుతున్నాడు. ఉదయం 8 గంటలకే రోహీణీకార్తె తాలూ కు ఎండ వేడిని పొడిపొడిగా చూపుతూ రానురాను 10గంటలకే అమ్మో ఎండ అనేట్టు చేస్తున్నాడు. రోహీణీకార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు అం టుంటారు. ఈ మాట ఈ ఏడాది ఎండలు చూస్తే నిజమనే అందరూ అనుకుంటారు.ఉదయం 10 గంటలు తరువాత పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరగడంతో ఇళ్ల నుండి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. కాగా సోమవారం ఖమ్మం జిల్లా 48 డిగ్రీలు సెంటీగ్రేడ్‌కు చేరుకుందని సమాచారం. రానున్న రోజుల్లో ఈ ఎండ మరింత పెరగనుందని అంటున్నారు. బుతుపవనాలు వస్తే గాని భూమిపై నాలు గు వర్షపు చుక్కలు పడితేగాని ఈ వేడికి ఉపశమనం చేకూరదని అంటున్నారు. జూన్‌ ‌నెలలోకి అడుగుపెట్టబోతున్న బుతు పవనాలు జాడేలేదు. వేడిగాలులు ఈ ఎండకు తోడై మనుషుల్లో డీహైడ్రేషన్‌ను పెంచుతున్నారు. ఎన్ని నీళ్లు తాగినా ఆవిరై పోతున్నాయేగాని దాహం తీరటం లేదు. ఇంట్లో కూర్చున్నవారికి వేడిగాలులు, ఎండ వేడి బాధ తప్పటం లేదు. ఉపశమనానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఇవ్వకపో వటంతో వృధ్దులు, పిల్లలు, పేషంట్లు చాలా  ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటలైనా భూతాపం తగ్గటం లేదు.
వేసవికాలంలో తప్పక జాగ్రత్తలు పాటించాలి : డాక్టర్‌ ‌మధుబాబు
 సాధ్యమైనంత ఎక్కువ నీటిని త్రాగాలి. సాధ్యమైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడుతుం ది. వ్యాయమం ఉదయం పూటనే చేయాలి. వృద్దులు, పిల్లలు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు పాటించాలి. వాంతులు, దస్తులు, జ్వరం వంటి లక్షణాలు ఉండే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చల్లటి నీటితో స్నానం చేయాలి. వదులు అయిన దుస్తులను ధరించాలి. వడదెబ్బ ప్రభావం వల్ల చెమట పట్టకపోవడం, మోఖం పోడిబారడం, శరీరం ఎర్రబారడం, తల  నొప్పి, దురద, వాంతులు, స్ప్రృహ కోల్పోవడం వడదెబ్బ లక్షణాలు. ఇలాంటివి ఉండే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు. లేదంటే ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. జాగ్రత్తలు పాటిస్తే ఎండ తీవ్రత నుండి బయటపడవొచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!