విజయవాడ, ఏప్రిల్ 27 : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 30న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అయింది. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. అయితే పాఠశాలలకు మొత్తం 43 రోజులు వేసవి సెలవులు ఇచ్చారు.