హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు.