Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో… పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కెటిఆర్‌

Suitable for investment in Telangana Minister KTR
థాయిలాండ్‌తో భారత్‌కు మంచి సంబంధాలు,ఇండియా-థాయ్‌లాండ్‌ ‌నెట్‌వర్కింగ్‌ ‌సమావేశంలో మంత్రి కెటిఆర్‌

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ అని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణ పారివ్రామిక విధానం ఉందన్నారు. థాయ్‌లాండ్‌తో భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ ‌మ్యాచింగ్‌ అం‌డ్‌ ‌నెట్‌వర్కింగ్‌ ‌సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ ‌హాజరయ్యారు. థాయ్‌లాండ్‌ ‌నుంచి థాయ్‌ ఉప ప్రధాని జరీన్‌ ‌లక్సనావిసిత్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌ ‌నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని అన్నారు. రబ్బర్‌వుడ్‌ ‌పరిశ్రమలో థాయ్‌లాండ్‌ ‌రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నదని మంత్రి తెలిపారు. భారత్‌తో థాయ్‌కు చాలా మంచి సంబంధాలున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలంగాణలో వాణిజ్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌రంగంలో అపార అవకాశాలున్నట్లు ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఇదే సమయంలో మంత్రి.. తెలంగాణలో ఫర్నిచర్‌ ‌పార్క్ ఏర్పాటు చేయాలని థాయ్‌లాండ్‌ ఉప ముఖ్యమంత్రిని కోరారు. బ్యాంకాక్‌-‌హైదరాబాద్‌ ‌విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ ‌థాయ్‌ ‌ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ‌థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని జరీన్‌ ‌లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

Tags: Furniture Park, india Thailand, Telangana IT, Industries& Municipal, Minister of State

Leave a Reply