Take a fresh look at your lifestyle.

‘అతిథి’ లెక్చరర్ల ఆత్మహత్యలు షురూ

  • నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా లో గణేష్‌ ‌చారీ ఆత్మ హత్య
  • జీతం ఇవ్వరూ.. కొనసాగించరూ?
  • 16 నెలలైనా పైసా లేదు.ఎలా బ్రతకాలి
  • పెండింగ్‌ ‌వేతనాలు విడుదల చేయరా?

అంకితభావంతో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. 16 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగ భద్రత లేకున్నా పనికి తగ్గ వేతనం అందడం లేదు. అయినా నిత్యవిద్యార్థులుగా నిబద్ధతతో ప్రభుత్వ ఇంటర్‌ ‌జూనియర్‌ ‌కాలేజీల్లో గెస్టు లెక్చరర్లు మెరుగైన సేవలుఅందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి 2012నుంచి ఈ అతిథి లెక్చరర్ల వ్యవస్థను ప్రారంభించారు. పీరియడ్కు రూ.150చొప్పున నెలకు 72 పీరియడ్స్ ‌బోధిస్తూ.. రూ.10,800 వేతనంతోకొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్‌ 2017 ‌లో ఒక పీరియడ్కు రూ.300కుపెంచడంతో నెలకు రూ.21600ల వేతనం అయింది. అయితే, మళ్ళీ వారినిపట్టించుకోకపోవడంతో అదే వేతనంతో ఎనిమిది ఏండ్లుగా విధులునిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కళాశాలలు తెరవక.. జీతం లేక దుర్బరపరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

తమ దీన స్థితిని ఇంటర్‌ ‌బోర్డు మార్చాలని,వెంటనే అతిథి లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగానాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజీల్లో బాటనీ గెస్ట్‌లెక్చరర్గా పనిచేసిన గణేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలలైనా జీతాలురాకపోవడం, ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంకా విధుల్లో తీసుకోకపోవడంతో.మనస్థాపానికి చెంది ఆత్మహత్య చేసుకుని మరణించారు. చావు సమస్యకు పరిష్కారం కాదు.. సమస్యల మీద పోరాడి సాధించు కావాలి ఆయన ఆత్మ హత్యకు కారకులు ఎవరు.?ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, ప్రభుత్వం, ఇంటర్‌ ‌బోర్డు బాధ్యతగా ఎక్స్ ‌గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.ఆయన కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు
– రావుల రాజేశం
లెక్చరర్‌. ‌కరీంనగర్‌

Leave a Reply