Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యలు పరిష్కారం కావు

  • లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందాం
  • టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్త స్వామి పాడెను మోసిన మంత్రి హరీష్‌రావు

బలవన్మరణానికి పాల్పడిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్త అంతిమయాత్రలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొనడమే కాకుండా పాడెను కూడా మోశారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ ‌మండలంలోని కోనాయిపల్లికి చెందిన కొత్తింటి స్వామి(34) దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో మనస్తాపంతో బుధవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు కోనాయిపల్లికి చేరుకుని స్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బలవన్మరణానికి పాల్పడిన కార్యకర్త స్వామి కుటుంబ సభ్యులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటాననీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..రాజకీయాల్లో  గెలుపు ఓటములు సహజమనీ,  ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావు..ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని, సహనం కోల్పోవొద్దనీ, ధైర్యంతో ముందుకు పోదామన్నారు. టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను, దుఃఖ పడ్డామన్నారు. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దనీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply