Take a fresh look at your lifestyle.

ఆత్మహత్యా? హత్యా?

  • వలస కార్మికుల కుంటుంబంపై వీడని అనుమానాలు
  • బావిలో మరో 5 మృతదేహాలు గుర్తింపు
  • తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
  • ప్రత్యేక బృందాలతో పోలీసుల విచారణ
  • సంఘటన స్థలాన్ని సందర్శించిన
  • మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి
రూరల్‌ ‌జిల్లా గొర్రెకుంట  ఇండస్ట్రీయల్‌ ‌ప్రాంతంలో పాడుబడిన బావిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు లభ్యమైన సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. శుక్రవారం అదే బావిలో మరో 5 గురి మృతదేహాలు బయటపడడంతో వలస కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోణం నుండి హత్యకు గురయ్యారనే అంశం తెరమీదకు వచ్చింది. శుక్రవారం ఉదయం స్థానికులకు అదే బావిలో మరో మృతదేహం తేలిఆడడంతో సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యు టీంతో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి వెంట ఒకరి చొప్పున మొత్తం 5 మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో గొర్రెకుంట సంఘటన మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం వెలికితీసిన మృతుల్లో మసూద్‌ ‌కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులతో పాటు వారితో కలిసి పని చేసే బీహార్‌కు చెందిన ఇద్దరు
image.png
ఎం‌జిఎంలో సంఘటనపై చర్చిస్తున్న మంత్రి దయాకర్‌రావు, రూరల్‌ ‌కలెక్టర్‌ ‌హరిత, సిపి రవీందర్‌

యువకులు, మరో వ్యక్తి ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ‌స్వయంగా విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘటనపై కమిషనర్‌ ‌మాట్లాడుతూ గురువారం ఇదే బావిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మసూద్‌తో పాటు ఆయన భార్య, కూతురు, మనమడు, మృతదేహాలు గుర్తించామన్నారు. తాజాగా మసూద్‌ ఇద్దరు కుమారులు షోయబ్‌ ఆలమ్‌, ‌సోహెల్‌ ఆలమ్‌తో పాటు మసూద్‌ ‌సమీప బందువుగా భావిస్తున్న వెస్ట్ ‌త్రిపురకు చెందిన ఎండి షకిల్‌, ‌మసూద్‌తో పాటు కలిసి పని చేస్తున్న బీహార్‌కు చెందిన శ్రీరామ్‌, ‌శ్యామ్‌ల మృతదేహాలను వెలికితీసి  పోస్టుమార్టం నిమితం వరంగల్‌ ఎం‌జిఎంకు తరలించామన్నారు. కాగా తొమ్మిది మృతదేహాలు వెలుగు చూసిన ఘటనపై విచారణకు ప్రత్యేక పోలీస్‌ ‌బృందాలను ఆరు టీంలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లూస్‌ ‌టీం, డాగ్‌ ‌స్క్వాడ్‌ ‌సిబ్బంది ఆదారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

వలస కార్మికుల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం సంఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. మృతి చెందిన తొమ్మిది మందిలో ఎవరి వద్ద కూడా వారికి సంబంధించిన సెల్‌ఫోన్లు లభించకపోవడం, బావిలో నుండి పూర్తిగా నీరంతా తోడినప్పటికీ అందులో కూడా రెండు చెప్పులు మినహా ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇందులో వెస్ట్ ‌త్రిపురకు చెందిన షకిల్‌ ‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, మసూద్‌కు దగ్గరి బందువుగా భావిస్తున్నారు. షకిల్‌ ‌గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోనే స్థిరపడ్డాడు. అతడికి భార్య, కుమారుడు, సోదరుడు ఉన్నాడు. కాగా సంఘటన జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటగా బయటపడిన మృతదేహాలతో వలస కార్మికుల కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించారు. కాని శుక్రవారం మరో ఐదుగురి మృతదేహాలు లభించడం, అందులో మసూద్‌ ‌కుమారులు కూడా ఉండడంతో పోలీసులు కూడా సంఘటన జరిగిన తీరుపై ఓ అంచనాకు రాలేక పోతున్నారు. మొత్తం సంఘటనలో మసూద్‌ ‌కుటుంబంలోని అందరూ మృతి చెందారు. అయితే ఈ కుటుంబం లోని మొత్తం ఆరుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా వారికి మత్తు మందు ఇచ్చి బావిలో వేసి హత్య చేశారా? బీహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా ఈ ఘటనలో మృతి చెందడంతో వారిని కూడా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మృతుల్లో మసూద్‌ ‌బందువు షకీల్‌ ‌తప్ప మిగిలిన ఎనిమిది మంది ప్రస్తుతం ఒకే చోట గత కొంత కాలం నుండి ఉంటున్నారు. వీరందరికి విషప్రమోగం చేసి బావిలో వేసి హత్య చేశారా? మృతుల్లో నుంచి ఒకరు ముందుగా అందరిపై విషప్రయోగం చేసి చంపివేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంజిఎంలోని 9 మృతదేహాల్లో ఒక షకీల్‌ అనే మృతుడికి బందువుల అనుమతితో పోస్టుమార్ట నిర్వహించారు. అయితే అతడి మృతదేహంలో నీటిలో మునిగినట్లు అనవాళ్ళు కనిపించలేదని తెలుస్తోంది.
పూర్తి కాని పోస్టుమార్టం
ఎంజిఎం మార్చురిలో మసూద్‌కు, బీహారి యువకులకు సంబంధించిన కుటుంబం సభ్యులు, బంధువులు ప్రస్తుతం ఎవరు లేకపోవడంతో వారి మృతదేహాలకు పోస్టుమార్టం జరగలేదు. అయితే బీహార్‌ ‌యువకుల కుటుంబసభ్యులను ఫోన్‌లో సంప్రదించగా తాము లాక్‌డౌన్‌ ‌వల్ల తెలంగాణకు వచ్చే స్తోమత లేదని, పోస్టుమార్టం చేసి మృతదేహాలను మాకు పంపాలని పోలీసులను అభ్యర్థించారు. శనివారం మేజిస్ట్రేట్‌ ‌సమక్షంలో వైద్యులు ఈ మృతదేహాలకు పోస్టుమార్టం చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఎంజిఎం మార్చురి వద్దకు, సంఘటన స్థలానికి చేరుకున్న వారిని మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌ ఎమ్మెల్యే నన్నపునే నరేందర్‌, ‌మేయర్‌, ‌రూరల్‌ ‌కలెక్టర్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డిలు తదితరులు ఓదార్చారు.

Leave a Reply