Take a fresh look at your lifestyle.

రోగనిరోధక శక్తిని పెంచే చెరకు – ప్రయోజనాలు

“చెరకు రసంలోని కాల్షియం, పాస్పరస్‌ ‌వంటి ఖనిజ లవణాలు దంత ఎనామిల్‌ ‌ను నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ఖనిజ లవణాలు దంతక్షయాన్ని నిరోధించి, దంతాలకు దృఢత్వాన్ని చేకూర్చుతాయి. దంతక్షయం, పోషకాల లోపంవల్ల కలిగే నోటి దుర్వాసన, చెడు శ్వాసను ఎదుర్కోవడంలో మరియు దంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో చెరకు రసం దోహదపడుతుంది. చెరకులో వుండే కాల్షియం, అస్తిపంజరానికి దృఢత్వాన్ని చేకూర్చడానికి, ఎముకలు దంతాలు బలపడడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల పెరుగుదలలో దోహదపడే ఉత్తమమైన వనరులలో ఒకటిగా ఉపయోగపడుతుంది. పెరిగే పిల్లలు ప్రతి రోజు ఒక గ్లాస్‌ ‌చెరకు రసం తీసుకోవడంవల్ల దంతాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. అజీర్ణంతో బాధపడే వ్యక్తులకు చెరకు రసం, ఆహారం జీర్ణం కావడానికి ఒక మంచి టానిక్‌ ‌లాగ పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఒత్తిడిలేని జీవితానికి చెరకు రసం ఎంతో దోహదపడుతుంది.”

అత్యవసరమైన జీవక్రియ రక్షకాలను (anti-oxidants) కలిగిన చెరకు రసం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుటలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీర్ణవ్యవస్థతో సహా, అనేక కాలేయ సంబంధిత వ్యాధులపై పోరాడే చెరకు, వృక్ష రాజ్యంలో (ఏకదల బీజాలు) పోయేసీ (Poaceae)) కుటుంబానికి చెందినది. చెరకు రసంలోని ప్రతీక్ష కారిణిలు anti-oxidants)) శరీరంలోని బిలిరుబిన్‌ (bilrubin)) స్థాయిలను తటస్థ పరుస్తాయి. ‘సచ్చారం ఆఫిషనరుమ్‌’ (Saccharum officianarum) ) అనే శాస్త్రీయ నామం కలిగిన చెరకు దాదాపు 4. 25 మీటర్ల వరకు ఎత్తు, 8 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగి మధ్య మధ్యన కణుపులను కలిగివుంటుంది.

చెరకు పుట్టుక – పంపిణి (Sugar cane-Origin & Distribution)
%భారత దేశంలో చెరకు వేదకాలం నుండి పండించబడుతుందని ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించబడింది. అలెగ్జాండర్‌ ‌ది గ్రేట్‌ (Alexander the great) తన సైనికులు క్రి. పూ. 325 లో చెరకును భారత దేశం నుండి పాశ్చాత్య దేశాలకు తీసుకు వెళ్లారని, బహుశా క్రి. పూ. 800 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా న్యూ గునియా ((New Guinea) కు చెందిన ప్రజలు పెంచారని తెలియజేయబడింది. ప్రస్తుతం చెరకును ప్రపంచం అంతటా సాగుచేస్తున్నప్పటికీ, చెరకు సాగులో భారత దేశం ప్రధమ స్థానంలో ఉండగా, బ్రెజిల్‌, ‌క్యూబా, చైనా, మెక్సికో, పాకిస్తాన్‌, అమెరికా, దక్షిణ ఆఫ్రికా మరియు కొలంబియా దేశాలు సాగు చేస్తున్నాయి. గడ్డి కుటుంబానికి Poaceae family) చెందిన ఈ చెరకు చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో సాగుచేయబడుతుంది. అనేక పోషకాలు కలిగిన చెరకును ఇనుప రోలర్ల ద్వారా నొక్కడం వల్ల చెరకు రసం తీయబడుతుంది. సేద తీర్చడంలో దోహదపడే ఈ చెరకు రసంలో 15% సహజ చెక్కరలు, సేంద్రియ లవణాలు, విటమిన్లు పుష్కలంగా వున్నాయి.

చెరకు రసం – ఆరోగ్య ప్రయోజనాలు (Sugar cane juice — Health benefits) )
మన ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగిన చెరకు రసం త్రాగడానికి తియ్యగా ఉండి అన్ని వయసులవారు ఇష్టపడేవిధంగా ఉంటుంది. వేసవికాలంలో చెరకు రసం ఓదార్పును (soothing drink)) కలిగిస్తుంది. కొద్దిగా నిమ్మ రసం, అల్లం రసం, చెరకు రసం యొక్క రుచిని మెరుగుపరుస్తాయి. సాధారణంగా పెరుగుతున్న పిల్లలలో అంటే 6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లలలో సాధారణమైన జ్వరంతోపాటు ఫీట్స్ , ‌మూర్ఛలను నయంచేయడంలో చెరకు ప్రయోజనకరంగా ఉంటుంది. చెరకు రసం మూత్ర పిండాల పనితీరును నియంత్రించడంలో, మూత్ర విసర్జన ( scanty urination, Oliguria) లో సహాయపడుతుంది. అధిక ఆమ్లత్వం గల మూత్రం, మూత్ర విసర్జనలో మంటను తగ్గించడంలో, విస్తరించిన ప్రోస్ట్రేట్‌ ‌గ్రంధి (nlarged Prostrate Gland)) మరియు నెఫ్రిటిస్‌(‌Nephritis)) లో చెరకు రసం దోహదపడుతుంది. మంచి ఫలితాలకోసం, చెరకు రసాన్ని నిమ్మ రసంతోకాని, అల్లం రసంతో కానీ, కొబ్బరి నీటితోగాని కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి నుండి (Jaundice) త్వరగా కోలుకోవచ్చు. అయితే చెరకు రసాన్ని శుభ్రంగా, ఇంట్లో తయారుచేసుకోవడం శ్రేయస్కరం.

నోటి దుర్వాసన – చెడు శ్వాస – సామాజిక ఇబ్బందికి కారణం :
దంత క్షయం నోటి దుర్వాసనకు దారితీస్తుంది. చెరకు రసంలోని కాల్షియం, పాస్పరస్‌ ‌వంటి ఖనిజ లవణాలు దంత ఎనామిల్‌ ‌ను నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ఖనిజ లవణాలు దంతక్షయాన్ని నిరోధించి, దంతాలకు దృఢత్వాన్ని చేకూర్చుతాయి. దంతక్షయం, పోషకాల లోపంవల్ల కలిగే నోటి దుర్వాసన, చెడు శ్వాసను ఎదుర్కోవడంలో మరియు దంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో చెరకు రసం దోహదపడుతుంది. చెరకులో వుండే కాల్షియం, అస్తిపంజరానికి దృఢత్వాన్ని చేకూర్చడానికి, ఎముకలు దంతాలు బలపడడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల పెరుగుదలలో దోహదపడే ఉత్తమమైన వనరులలో ఒకటిగా ఉపయోగపడుతుంది. పెరిగే పిల్లలు ప్రతి రోజు ఒక గ్లాస్‌ ‌చెరకు రసం తీసుకోవడంవల్ల దంతాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. అజీర్ణంతో బాధపడే వ్యక్తులకు చెరకు రసం, ఆహారం జీర్ణం కావడానికి ఒక మంచి టానిక్‌ ‌లాగ పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఒత్తిడిలేని జీవితానికి చెరకు రసం ఎంతో దోహదపడుతుంది. జపాన్‌ ‌లోని త్సుకుఉబా విశ్వవిద్యాలయ sukuba University)) పరిశోధకులు చెరకు రసం ఒత్తిడిని తగ్గిస్తుందని, ఒత్తిడి ప్రభావిత నిద్రను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తెలిపారు.

చెరకు రసంలో వుండే పొటాషియం, జీర్ణాశయంలోని pH స్థాయిలను నియంత్రించడానికి, జీర్ణరసాల స్రావాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో, శరీరం కోల్పోయిన చెక్కర స్థాయిలను తిరిగి పూరించడానికి దోహదపడే సుక్రోస్‌ ‌చెక్కరలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు అవసరమయే ఫోలిక్‌ ఆమ్లం (Folic Acid)), విటమిన్‌ – ‌బి 9 (Vitamin-B9) కూడా చెరకు రసం నుండి లభిస్తుంది మరియు పుట్టే పిల్లలను నాడీ లోపాల నుండి రక్షించడంలో దోహదపడుతుంది. చెరకు రసం మహిళలలో అండోత్సర్గ సమస్యలను తగ్గించి, గర్భధారణ అవకాశాలు పెంపోందిస్తుందని పరిశోధనలో వెల్లడిఅయ్యింది. వాస్తవానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు రసాన్ని మితంగా తీసుకోవడంవల్ల, చెరకు రసంలోని సుక్రోజ్‌, ‌రక్తంలోని చెక్కర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ చెరకు రసంను సేవించడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ Toxins)) మరియు ఇతర foreign elements ను తీసివేయడంలో, శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలోజరిగే జీవక్రియలను నియంత్రిస్తుంది. ఈ డీ-టాక్సిఫికేషన్‌ ‌ప్రక్రియ క్రమంగా బరువు తగ్గించడానికి దారితీస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడమేకాకుండా, గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. చెరకు రసంలో వుండే సుక్రోజ్‌ ‌సహజంగా ఏ రకమైన గాయాన్నయినా తక్కువ వ్యవధిలో నయం చేయగలదు. చెరకు రసం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తూ, UTI సమస్యలను నివారిస్తుంది. నిమ్మరసం, కొబ్బరి నీరు కలిపినా చెరకు రసాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవడంవల్ల మూత్రపిండ సంబంధిత వ్యాధుల నివారణలో దోహదపడుతుంది.

చెరకు రసం శరీరంలోని ప్రొటీన్ల స్థాయిని పెంపొందిస్తుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లు, UTI, ప్రోస్టేటైటిస్‌ ((Prostatitis)) వంటి మూత్రపిండ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. చెరకు రసం సహజంగానే ఆల్కలీన్‌ ((alkaline)), కాబట్టి జీర్ణాశయ పేగులలో ఆమ్లత్వాన్ని తగ్గించి, మంటనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది శరీరంలోని ఆమ్లాక్షారత్వాన్ని, సమతుల్యతను కాపాడడంలో పాత్రవహిస్తుంది. ఇది కాలేయం మరియు జీర్ణవ్యవస్థతో సహా అనేక వ్యాధులపై వ్యతిరేకంగా పోరాడుతూ, శరీరంలో రోగనిరోధకశక్తిని బలోపేతంచేస్తుంది. కాబట్టి ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో, రోగ నిరోధకశక్తిని పెంపొందించే చెరకు రసాన్ని సేవిస్తూ, సురక్షితంగా వుంటూ, మహమ్మారి కోవిడ్‌ -19 ‌బారినుండి విముక్తులమవుదాం.
డా. సి. హెచ్‌. ‌రమ్య శ్రీ ,డెంటిస్ట్
‌డా. కే. సురేందర్‌ ‌రెడ్డి మల్టీ స్పెషాలిటీ డెంటల్‌ ‌క్లినిక్‌,
‌హనంకొండ, వరంగల్‌.

 

Leave a Reply