Take a fresh look at your lifestyle.

షుగర్‌ ‌వ్యాధికి ఇబ్బంది లేని ఆహారం.. తెలంగాణ సోనా..

  • వరి సన్నరకం దిగుబడి తక్కువ అనేది అవాస్తవం
  • గోనెపల్లి అవగాహన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్‌  ‌మండలంలోని గోనెపల్లిలో మండల సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులకు ప్రాధాన్య పంటలు సాగుపై మంగళవారం  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు,  జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ( ‌తెలంగాణ సోనా రకం కనుగొన్న శాస్త్రవేత్త ) దామోదర్‌ ‌రాజు, సిఎం  ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ‌జిల్లా రైతుబంధు సమన్వయ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపిపి కూర మాణిక్‌ ‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, ‌మండలానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… దేశంలోనే షుగర్‌ ‌వ్యాధికి ఇబ్బంది లేని ఆహారం తెలంగాణ సోనా రకం బియ్యం అన్నారు.  వరి సన్నరకం దిగుబడి తక్కువ అనేది అవాస్తవం.   పోయిన వానాకాలం 8500 ఎకరాల్లో మక్కజొన్న వేశారని, ఈ వానా కాలంలో వరి, కంది పంటలకు మార్చాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  వానా కాలంలో మక్కజొన్న పంట వేస్తే కత్తెర పురుగు సోకి దిగుబడి 20 క్వింటాళ్లు తగ్గుతుందనీ,  పైగా బూజు పట్టి మొలకెత్తకుండా ఉంటుందని వచ్చే నష్టాలను రైతులకు సవివరంగా మంత్రి వివరించారు.  వానా కాలంలో బదులుగా యాసంగిలో మక్కజొన్న వేయాలని ప్రభుత్వం సూచిస్తుందనీ, యాసంగిలో వరి పంట తగ్గించి, మక్కజొన్న పంట వేసేందుకు పోతే దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు.

గోనెపల్లిలో అధికంగా దొడ్డు రకం వరి వడ్లు పండించి, సన్న రకం బియ్యం బయట కొనుక్కొని వస్తున్నారనీ,  ఆ సన్న రకం పంటలు గోనెపల్లిలోనే పండించాలని రైతులు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.  సన్న రకానికి 2100, 2200 రూపాయలు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు.  వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ‌దామోదర్‌ ‌రాజు తెలిపినట్లు.. ఆరుద్రలో కాలంతో పనిలేకుండా ఆమని వెరైటీ వేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.  జూలై మాసంలో తెలంగాణ సోనా రకం నారు పోసేలా చర్యలు చేపట్టాలనీ,  తెలంగాణ సోనా 120 రోజుల్లో పంట పండుతుందని మంత్రి వెల్లడించారు.  రైతుబంధకు 14 వేల కోట్లు, రైతురుణ మాఫీకి 25కోట్లు, ఉచిత కరెంటుకు 10వేల కోట్లు.. మొత్తం 60 వేల కోట్ల రూపాయలు రైతుపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని మంత్రి వివరించారు.  మూస పద్ధతిలో, పాత సంప్రదాయ పద్ధతుల పంటల వైపునకు వెళ్లకుండా.. ప్రత్యామ్నాయ ప్రాధాన్యత పంటల సాగుకు వెళ్లి అధిక మొత్తంలో రూపాయలు రైతులు సంపాదించాలన్నదే సీఎం కేసీఆర్‌ ‌ధ్యేయమన్నారు. వానా కాలం-2020 ప్రాధాన్యత పంట సాగుకు చిన్నకోడూర్‌ ‌మండలంలోని 25 గ్రామాలకు గానూ 15 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయనీ, మిగతా 10 గ్రామాలు ఇంకా ఎందుకు కాలేదని స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆరా తీశారు.  సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం ప్రాధాన్య పంటల సాగులో ఏకగ్రీవం చేసే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులుగా మనపై ఉందన్నారు.  చిన్నకోడూర్‌ ‌మండలంలోని ప్రతీ క్లస్టరులో రైతు వేదికల నిర్మాణాలు జరగాలనీ,  మండలంలో 8 క్లస్టర్లు ఉన్నాయనీ, సరైన స్థలాల్లో ఎంపిక చేసి 4 రోజుల్లో త్వరితగతిన నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఏఈఓలు సమన్వయంతో ప్రారంభించాలని మంత్రి  హరీష్‌రావు ఆదేశించారు.  చిన్నకోడూర్‌ ‌మండలంలోని గ్రామాల వారీగా పోయిన వానా కాలంలో సాగు చేసిన పంటల వివరాలు, ఈ వానా కాలంలో వేయనున్న ప్రాధ్యాన పంటల సమగ్ర వివరాలను ఏఈవోలు, ఆయా గ్రామ రైతుబంధు సమన్వయ కర్తలను క్షుణ్ణంగా మంత్రి ఆరా తీశారు.

Leave a Reply