Take a fresh look at your lifestyle.

వరి విత్తనాలను డీలర్లు విక్రయించొద్దు : కలెక్టర్‌

‌సూర్యాపేట, మే 19, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై ప్రత్యేక మెళుకవలు చూపాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాలోని సీడ్‌ ‌డీలర్లు, వ్యవసాయ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయ అధికారుల పాత్ర చాలా కీలకమని, విత్తన డీలర్లు ఏ పంటకు సంబంధించి నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించిన జిల్లా ప్రణాళికలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎట్టిపరిస్థితుల్లో వానాకాలం పంటకు వరి  విత్తనాలు అమ్మొద్దని డీలర్లకు సూచించారు. రైతులను మోసం చేసే దళారులపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రత్యేక అవగాహన కల్పించాలని కోరారు. అలాగే ప్రత్యామ్నాయ పంటలైన పత్తి, కంది, పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్త్తనాలను అందించి, విక్రయాలను సజావుగా సాగే విధంగా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాయింట్లలో విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలీస్‌ , ‌వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయిస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ ‌దృష్ట్యా రైతులు ఎరువుల దుకాణాల వద్ద మాస్క్‌లు, సామాజిక దూరం పాటించాలని, అలాగే అన్ని కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ జ్యోతిర్మయి, రామునాయక్‌, ‌జగ్గు నాయక్‌, ‌సంధ్యారాణి, వాసు, వివిధ కంపెనీల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!