ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి ముఖ్యమైన పదవి లభించింది. ఆయనను మూసీనది తీర ప్రాంత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ఇచ్చారు.ఈ పదవికి రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ హోదా కల్పించింది. సుధీర్‌రెడ్డి ఈ పదవిలో మూడేండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. ఈయన 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు.
ఎల్బీనగర్ నగర్ నియోజక వర్గం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందుననే తాను టీఆర్ఎస్ చేరానని ఆయన అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు ఈ పదవి లభించిందని రాజకీ యవర్గాలు భావిస్తున్నాయి. మూసీనదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, మూసీని నిరంతర ప్రవాహ జీవనదిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్న క్రమంలో సుధీర్‌రెడ్డికి ఈ పదవి లభించడం చర్చనీయాంశమైంది. మరోవైపున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి సారించినందుననే ఈ శాసనసభ్యడికి ఈ పదవి లభించదనే చర్చ కూడా జరుగుతున్నది.