Take a fresh look at your lifestyle.

‘ఉపాధి’ పనులను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

జగిత్యాల రూరల్‌ ‌మండలం లో మంగళవారం ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులను జిల్లా కలెక్టర్‌ ‌జి. రవి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్‌ ‌మండలం లోని గుల్ల పేట గ్రామములో ఉపాధి హామీ పథకం కింద పంట కాలువ పూడికతీత పనులను పరిశీలిం చారు. ఈ పనులలో 35 మంది పని చేస్తుండగా కరోనా వైరస్‌ ‌లో భాగంగా ఒకరికొకరు సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించారు. ఈ పనులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామములోని నర్సరీని పరిశీలించి గ్రామ సర్వే డిమాండ్‌ ‌రిజిస్టర్‌ ‌తనిఖీ చేసి రిజిస్టర్‌ ‌ప్రకారముగా నర్సరీలో మొక్కలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. నర్సరీలో ఏర్పాటుచేసిన జీవాఅమృ తము ను ఏ విధముగా తయారు చేస్తున్నారని , ఏ విధముగా ఉపయోగించుకున్నారని అక్కడి సిబ్బంది ని అడిగి తెలుసు కున్నారు. రిజిస్టర్‌ ‌ప్రకారముగా నర్సరీలో మొక్కలు పెంచడా న్ని తనిఖీ చేసిన అనంతరం బాగుగా ఉన్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే గ్రామంలో వరి కొనుగోలు ధాన్యం సెంటర్ను పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడుతూ క్వాలిటీని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెక్‌ ‌చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు, హమాలీలు దూర దూరముగా ఉంటూ మాస్కులు ధరించాలి అని అన్నా రు.

అనంతరం రూరల్‌ ‌మండలంలోని కల్లెడ గ్రామములో ఏర్పాటుచేసిన మంకీ ఫుడ్‌ ‌కోర్ట్ ‌లో పండ్ల మొక్కలకు పరిశీలించి , మొక్కలకు నీరూ నిల్వ ఉండటం కొరకు ఉపాధి హామీ పథకం లో భాగంగా 50 మంది కూలీలతో కాటూరు కందకాలు పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడుతూ ఒకరి ఒకరికి మధ్యలో దూరము ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ ‌తో చెట్ల పెరుగుదల తదితర అంశాలపై చర్చించినారు. అనంతరం సర్పంచ్‌, ఎం‌పిటిసి, రైతులు కొందరు కలెక్టర్‌ ‌తో గ్రామంలో దాన్యం కొనుగులు కేంద్రం చిన్నగా ఉన్నందున కొనుగులు కేంద్రానికి అనుకొని రోడ్డుకు ఇరుపక్కల ఉన్న ధాన్యాన్ని అక్కడే తూకం చేసుటకు వెసులుబాటు కల్పించాలి అని కోరారు. దీనితో కలెక్టర్‌ ‌రైతులకు ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులకు ఇట్టి విషయాన్నీపరిశీలించి చర్యలు తీసుకోగలరు అని తెలిపారు. ఈ పర్యటనలో డిఆర్డిఏ పిడి లక్ష్మీనారాయణ, తాసిల్దార్‌ ‌దిలీప్‌, ఎం‌పీడీవో రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌, ‌గ్రామ కార్యదర్శులు, విఆర్‌ఓలు, సర్పంచ్‌లు, ఎంపి టిసిలు, కల్లెడ సర్పంచ్‌ ‌మహేశ్వర్‌ ‌రావు ,ఎంపిటిసి పరుశురాం గౌడ్‌, ఉప సర్పంచ్‌ ‌రాంచంద్రం, వార్డ్ ‌సభ్యులు , మహిళలు, ఐ కె పి సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply