Take a fresh look at your lifestyle.

స్వీయ ఔన్నత్యంతో సక్సెస్‌..

“సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోకండి. సాధించగల శక్తి సామర్ద్యం లను విశ్లేషణ చేసుకోవాలి. ఇతరుల గౌరవంను సంపాదించ డానికి మంచి వ్యక్తిగా కొన్ని పనులు చేయాలి. ఇతరులను భయపెట్టే పనులను చేయకూడదు. ఓటమినుండి గెలుపు కోసం కావల్సిన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకోగలం అని విశ్వసించాలి. మనిషి చేయగల ప్రతి పనిని నేను చేయగలను అనే నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి సాధన వెనక, జీవితాశయం నెరవేర్చుకోవడం, వ్యక్తిలోని ఆలోచనలు, చేసే పనులు, ప్రతి నిర్ణయం వెనక సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు, కష్టాలు వెంటాడుతున్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌రక్షిస్తుంది.”

ఒక స్నేహితురాలితో మీ డ్రస్‌ ‌చాలా బాగుంది. చాలా అందంగా కనిపిస్తున్నారు అని అనే సరికి ఆ స్నేహితురాలు వెంటనే ఆ.. అలాంటి దేమి లేదు. ఇదేమి కొత్త డ్రెస్‌ ‌కాదు ఎప్పటి లాగానే ఉన్నాను కదా ఫ్రెండ్‌ ‌తో అని, లోలోపలే బాధ పడుతూ నన్ను ఏడిపించడానికే నా స్నేహితురాలు దెప్పి పొడిసిందని తీవ్రంగా ఆలోచించే వారు ఎక్కువయ్యారు. ఇలాంటి ప్రవర్తనను తక్కువ స్వీయగౌరవం తో ప్రవర్తిస్తూ ఉంటారు. తరగతిలో బాగా చదివే వారు కూడా పరీక్షలు రాయాలంటే ఆందోళన చెందుతున్నారా? ఏదైనా సాధించగలిగే సామర్థ్యమున్నా, ఏదీ సాధించలేకపోతున్నారా? నేనెందుకూ పనికిరాను అన్న భావన వస్తుందా? అందంగా లేను అన్న ఫీలింగ్‌ ఇబ్బంది పెడుతోందా? ఇతరులతో పోల్చుకుని భాధపడుతున్నారా? ఇలాంటి ఆలోచన భావనలు కలిగి ఉన్న వారు సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌తో బాధపడుతున్న వారే. తనకు తానుగా ప్రేమించుకోకపొవడమే కారణం.

తనకు తాను గౌరవించుకోవాలి : మనిషికి మొదట కావాల్సింది ఆత్మగౌరవం. తనను తాను ప్రేమించు కోలేనివారు, గౌరవించు కోలేనివారు… ఇతరులను గౌరవించలేరు. ప్రేమించ లేరు. మొదటగా తనకు తానుగా ప్రేమించుకోవడం, తన పట్ల తాను గౌరవం పెంచుకోవడం చేయాలి. అందరికంటే తక్కువ అనే భావనను మనసులో నుండి తీసేయాలి. లక్ష్య సాధనలో అనేక సమస్యలు ఎదుర్కోవలిసి ఉంటుంది. ఒక్కో సారి సక్సెస్‌ ‌కావచ్చు, కాకపోవచ్చు. ఓటమిలోని వైఫల్యాలను విశ్లేషణ చేసుకుంటే భవిష్యత్‌లో మరెన్నో విజయాలకు చేరుకుంటారు.మనిషి ఎదుగుదలలో ఆత్మగౌరవానిదే కీలక పాత్ర.

సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌బాల్యం నుంచే : ప్రతి మనిషికీ బాల్యం ఒక మధురానుభూతి. భావి జీవితాన్ని ప్రభావితం చేసే భావాలు కూడా ఆ సమయంలోనే మెదడులో నాటుకుపోతాయి. మనిషి శరీరంలో అతివేగంగా అభివృద్ధి చెందే అవయవం మెదడు. తల్లిగర్భం నుంచి బయటపడ్డ బిడ్డ మెదడు పెద్దవాళ్ల మెదడులో 8వ, వంతు సైజులో ఉంటుంది. ఏడాదిన్నర వయసొచ్చేసరికి పెద్దవాళ్ల మెదడులో సంగం సైజుకు చేరుకుంటుంది. ఇలా వేగంగా అభివృద్ధి చెందే బాల్యదశలో అనేక అనుభవాల, అనుభూతుల, జ్ఞాపకాల ముద్రలు మెదడులో నాటుకుపోతాయి. ఒకసారి బలంగా నాటుకుపోయిన ఆలోచనలుగానీ, భావాలుగానీ, గుర్తులుగానీ తర్వాత తొలగించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్ని చిన్నప్పట్నుంచే ఏ విధంగా తీర్చిదిద్దితే, ఏ విధమైన భావాలు వారిలో నింపితే జీవితాంతం ఆ విధమైన వాటికే ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలకు నైతిక విలువల పట్ల, సమాజంలో ఏవిధంగా మసలు కోవాలి, స్వీయ గౌరవ భావం పట్ల శ్రద్ద వహిస్తే పెద్దయ్యాక మంచి లక్షణాలు అలవరచుకుంటారు.

సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌తో సమాజంలో రాణిస్తారు: సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌తొ తమపట్ల తమకు విశ్వాసం, నమ్మకంను కలిగి ఉంటారు. తమలో ఇతరులు గౌరవించదగ్గ అర్హతలు గుర్తించడం జరుగుతుంది. అధికారుల ముందు ఎలాంటి భయమూ లేకుండా, కంఫర్టబుల్‌గా, ఇతరులను ప్రభావితం చేసే సమర్ధతను ప్రదర్శిస్తారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు. బాధ్యతలను, సద్విమర్శలను స్వీకరించడం, మాటలకంటే, చేతలకే ప్రాధాన్యత నివ్వడం, ఇతరుల అభిప్రాయాలకు, మాటలకు విలువనివ్వడంతో సమాజంలో మంచి గుర్తింపుతో రాణిస్తారు.

సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌స్కేల్‌ ‌తో పరిశీలించుకోండి : ప్రపంచంలో సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌ను పరీక్షించుకోవడానికి రోషన్‌ ‌బర్గ్ ‌సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌స్కేల్‌ (‌తెలుగు అనువాదం చేసి ఇవ్వడం జరిగింది) అత్యంత్య ప్రాచుర్యంలో ఉంది. ఈ క్రింద నివ్వబడిన వాక్యాలలో గత రెండు వారాలనుండి మీ యొక్క ప్రవ్త్రనా ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా అంగీకరించకపోతే (0), అంగీకరించకపోతే (1), అంగీకరిస్తే (2), బలంగా అంగీకరిస్తే (3) పాయింట్లు 1,3,4,7,10 ప్రశ్నలకు, మిగిలిన ప్రశ్నలకు రివర్సులో స్కోరింగ్‌ ఇచ్చుకోవాలి.

1. మొత్తం మీద నాకు నేను సంతృప్తి చెందుతున్నాను అని భావిస్తున్నాను
2. కొన్ని సార్లు నాలో మంచి లేదు అని భావిస్తున్నాను
3. నేను చాలా మంచి గుణాలను కలిగి ఉన్నాను అని భావిస్తున్నాను
4. ఇతరులు చాలా మంది చేసే పనులను నేను చేయగలను అని భావిస్తున్నాను
5. నేను గర్వపడేంతగా లేను అని భావిస్తున్నాను
6. కొన్ని సార్లు నిస్సహాయంగా ఉంటాను అని భావిస్తున్నాను
7. నేను విలువలు కలిగిన వ్యక్తిని, కనీసం ఇతరుల స్తాయిని కలిగి ఉన్నానని భావిస్తూ ఉన్నాను.
8. నేను నా కోసం ఎక్కువ గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను భావిస్తున్నాను
9. నేను అన్నింటిలో ఓడిపోతున్నానేమోనని భావిస్తున్నాను.

10. నేను సానుకూల వైఖరిని కలిగి ఉన్నాను అని భావిస్తున్నాను. మొత్తం స్కోరు 15 కంటే తక్కువగా వస్తే ఈ క్రింది వాటిని అభివృద్ది చేసుకోవాలి.

స్వీయ ఔన్నత్యం తో సక్సెస్‌ : ‌సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోకండి. సాధించగల శక్తి సామర్ద్యం లను విశ్లేషణ చేసుకోవాలి. ఇతరుల గౌరవంను సంపాదించ డానికి మంచి వ్యక్తిగా కొన్ని పనులు చేయాలి. ఇతరులను భయపెట్టే పనులను చేయకూడదు. ఓటమినుండి గెలుపు కోసం కావల్సిన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకోగలం అని విశ్వసించాలి. మనిషి చేయగల ప్రతి పనిని నేను చేయగలను అనే నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి సాధన వెనక, జీవితాశయం నెరవేర్చుకోవడం, వ్యక్తిలోని ఆలోచనలు, చేసే పనులు, ప్రతి నిర్ణయం వెనక సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు, కష్టాలు వెంటాడుతున్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్‌ ‌రక్షిస్తుంది.

Atla
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

 

Leave a Reply