Take a fresh look at your lifestyle.

సమ్మెకు తరలండోయ్‌

‘అధికార పీఠం ఎక్కింది మొదలు
అప్రజాస్వామిక చర్యకు పాల్పడే
దుష్ట పాలకుల కట్టడి చేయకుంటే
నిరంకుశ ప్రభుత్వం  కూల్చకుంటే
జాతి అస్తిత్వ సమస్తం ప్రశ్నార్థకమే
దేశ భవితవ్యం అంధకారబంధురమే

అందుకే…ఇకనైనా
కార్మికులారా…కర్షకులారా
చెమట చుక్కల శ్రామికులారా
సార్వత్రిక సమ్మెకు కదలండోయ్‌

‌బాధితులారా…పీడితులారా
బాధాతప్త  బహుజనులారా
ఎర్ర పిలుపందుకు తరలండోయ్‌

‌కష్టజీవులారా..కర్మవీరులారా
భగభగ మండే సూర్యుల్లారా
నిప్పు కణికలై వర్శించండోయ్‌

‌యువకుల్లారా..యువతుల్లారా
రూధిరం నిండిన యవ్వనులారా
యుద్ధ క్షిపణులై జ్వలించండోయ్‌

ఉద్యోగుల్లారా..ఉద్యోగార్థుల్లారా
తలపండిన పదవి విరమణులరా
విప్లవ సంద్రమై వెల్లువెవత్తండోయ్‌

‌యోధుల్లారా…యోగ్యుల్లారా
సమ సమాజ స్వాప్నికులారా
సమర గీతమై ధ్వనించండోయ్‌

‌సంఘటితులారా సమ్మతులారా
సబ్బండ జాతుల సమర్ధుల్లారా
సార్వత్రిక సమ్మెకు కదలండోయ్‌
‌బందును జయప్రదం చేయండోయ్‌
అరుణారుణ జెండా ఎగరేయండోయ్‌

‌సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా… – కోడిగూటి తిరుపతి :9573929493.

Leave a Reply