- సీపీఐ( ఎం-ఎల్ )రెడ్ స్టార్ TUCI (Trade union Centre of india) రాష్ట్ర కమిటీ పిలుపు
ఈ నెల 26 న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని టీ యూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వి మల్లేశ్వర్ సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ సంతోష్ కోరారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు రైతులు ప్రజలకు వ్యతిరేకంగా బిల్లులను తీసుకువచ్చి వారి హక్కులను కాలరాసే విధంగా ఉందని అందులో భాగంగా కార్మిక చట్టాలు కుదింపు రైతు వ్యతిరేక బిల్లు విద్యుత్ బిల్లు తీసుకువచ్చి తీవ్ర అన్యాయానికి గురి గురిచేసి వారికి రక్షణ లేకుండా చేసిందని పేర్కొన్నారు.
నూతన బిల్లులను రద్దు చేయాలని, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులో వల్ల కార్పోరేట్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ వారి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఇరవై ఆరు న జరిగే దేశ వ్యాప్త సమ్మె సమ్మెలో పెద్దఎత్తున కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయ వంతం చేయాలని చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు.