వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు: స్పెషల్‌ ‌కలెక్టర్‌

January 30, 2020

Success is achieved through hard work Special Collector

పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా, కష్టపడి చదవాలని వరంగల్‌ అర్బన్‌ ‌స్పెషల్‌ ‌కలెక్టర్‌ ‌మనుచౌదరి అన్నారు. బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయం ‘ఉపాధి సూచన సహాయ కేంద్రం’ ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారిలోని ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల ఆడిటోరియంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించుటకు సలహాలు, సూచనలు అందించే కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్‌ ‌కలెక్టర్‌ ‌ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులలో పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, రోజుకు 12 గంటలు నిరంతరంగా చదివానని ఆయన సూచించారు. దేశంలో సివిల్‌ ‌సర్వీస్‌ 19 ‌రకాలు ఉంటాయని మనం సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉద్యోగ భర్తీ జరుగుతుందన్నారు. విద్యార్థులు నిరంతరంగా పుస్తక పఠనం చేయాలని అంగట్లో ఉద్యోగ భర్తీ కోసం అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు తప్పకుండా చదవాలని ప్రత్యేక కలెక్టర్‌ ‌విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న లెఫ్ట్నెంట్‌ ‌కల్నల్‌ ‌మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ మాతృభూమికి సేవలందించడానికి, ఆర్మీలో చేరుటకు పదవ తరగతి నుండి డిగ్రీ స్థాయి వరకు వివిధ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టాల్సిన చర్యలను పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా బిక్షపతి వివరించారు. ఆర్మీలో పని చేయడం ఎంతో గర్వంగా ఉంటుందని దేశానికి నిరంతరం రక్షణగా ఆర్మీ ఉద్యోగస్తులు మైనస్‌ ‌డిగ్రీ చలిలో పని చేస్తారని ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ దేశ సేవ చేయడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు. ఆర్మీ లో చేరుటకు విద్యార్థులకు బిక్షపతి సలహాలు సూచనలు అందించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య ఐలయ్య మాట్లాడుతూ పోటీతత్వంలో నెగ్గుకు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కెయు ఉపాధి సలహా సూచన సహాయ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ ‌కట్ల రాజేందర్‌ ‌మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు తగు సలహాలు సూచనలు కేంద్రం ద్వారా అందిస్తామన్నారు. అనంతరం వరంగల్‌ అర్బన్‌ ‌ప్రత్యేక కలెక్టర్‌ను, లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌బిక్షపతిని కళాశాల తరపున ప్రిన్సిపల్‌ ‌ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ‌ప్రిన్సిపల్‌ ‌డాక్టర్‌ ‌స్వర్ణలత, కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ ‌పెద్ద వెంకటయ్య, డాక్టర్‌ ‌గడ్డం కృష్ణ, డాక్టర్‌ ‌స్వామి, డాక్టర్‌ ‌జితేందర్‌, ‌డాక్టర్‌ ‌శ్రీనివాస్‌, ‌డాక్టర్‌ ‌సౌజన్య, డాక్టర్‌ ‌ఫణీంద్ర, డాక్టర్‌ ‌ప్రసాద్‌, 200 ‌మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:  Special Collector,Kakatiya University, Competitive Examination, Degree and PG Students, Arts and Sciences Museum, Auditorium in Hanmakonda, Subedari under the Employment ,Reference Help Center