Take a fresh look at your lifestyle.

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయండి : మంత్రి పువ్వాడ

ఖమ్మం అర్బన్‌, ‌జూలై 23, (ప్రజాతంత్ర విలేకరి) : రాష్ట్ర ఐటి, పురపాలిక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా ఎంపి జోగినిపల్లి సంతోష్‌ ‌పిలుపు మేరకు చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రారం ఖమ్మం నగరంలోని విడివోస్‌: ‌కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ స్తాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.

ఖమ్మం నియోజకవర్గంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్‌ ‌పునుకొల్లు నీరజ, ఎంఎల్‌సి బాలసానీ లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ ‌బచ్చు విజయ్‌కుమార్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌ఫాతిమా,ఆయా డివిజన్ల కార్పోరేటర్‌లు కమర్తపు మురళి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఆర్జెసి కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply