Take a fresh look at your lifestyle.

నీట మునిగిన సిరిసిల్ల కలెక్టరేట్‌…‌

ట్రాక్టర్‌లో బయటకు వొచ్చిన కలెక్టర్‌ ‌జయంత్‌
‌రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ‌మరోసారి నీట మునిగింది. ఈ సారి కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంత్‌ ‌కూడా కలెక్టరేట్‌లో చిక్కుకున్నారు. కలెక్టరేట్‌ ‌ప్రాంగణంలోని క్యాంప్‌ ఆఫీసులో ఉన్న ఆయన..బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాత్రి నుంచి అక్కడే ఉండిపోయారు. మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కలెక్టర్‌ ‌వెళ్లాల్సి ఉండగా వరద తీవ్రంగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. దీంతో ట్రాక్టర్‌, ‌జేసీబీ తీసుకొచ్చి.. ట్రాక్టర్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంత్‌ను బయటకు తీసుకొచ్చారు.

ట్రాక్టర్‌ ఆగిపోతే నెట్టేందుకు వెనకాలే జేసీబీ కూడా వెళ్లింది. వర్షం పడిన ప్రతీసారి కలెక్టరేట్‌ ‌చుట్టూ వరదనీరు చేరుతుంది. గతంలోనూ రెండు మూడు సార్లు కలెక్టరేట్‌ ‌నీట మునిగింది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్‌ ‌చుట్టూ దాదాపు అరకిలోవి•టరు మేర భారీగా వరద నీరు చేరింది. నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. కలెక్టరేట్‌కు వెళ్లే మార్గం చిన్నపాటి నదీ ప్రవాహంలా కనిపిస్తుంది. కలెక్టరేట్‌ ‌చుట్టూ చేరిన నీటిని బయటకు పంపిచేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply