Take a fresh look at your lifestyle.

మైనింగ్‌ ‌తవ్వకాల్లో నిబంధనలకు పాతర

కలసపాడు ఘటన అధికారులకు కనువిప్పు కావాలి
కడప : కలసపాడు పేలుడు ఘటన తరవాత కనీస అనుమతులు కూడా లేకుండా పేలుడు పదార్థాల నిల్వ, రవాణా చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘోర దుర్ఘటన జరిగి పదిమంది మృత్యు ఒడికి చేరాక జిల్లా యంత్రాంగం మేల్కొంది. మైనింగ్‌లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై కలెక్టర్‌ ‌హరికిరణ్‌ ‌రాత్రికి రాత్రే నివేదిక పంపారు.

పులివెందుల నియోజకవర్గం వేంప్లలె నుంచి ప్రమాదం జరిగిన మామిళ్లపల్లి ముగ్గురాళ్ల భూగర్భ మైనింగ్‌ ‌వరకు ఏమాత్రం భద్రత లేని వాహనంలో జిలెటిన్‌ ‌స్టిక్స్, ‌డిటోనేటర్స్ ‌వంటి పేలుడు సామాగ్రిని ఎలా రవాణా చేశారు.. వేంప్లలెలో నిల్వ చేసిన వ్యక్తికి ఎక్స్‌ప్లోజివ్‌ ‌లైసెన్సులు ఉన్నాయా తదితర అంశాలపై తాజాగా దర్యాప్తు సాగిస్తున్నారు. మైనింగ్‌ ‌లీజు తీసుకున్న యజమాని ఖనిజ తవ్వకాలు చేపట్టే సమయంలో బ్లాస్టింగ్‌ ‌చేస్తే.. తప్పక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి మైనింగ్‌ ‌లీజుదారుడికి ఎక్స్‌లోజివ్‌ ‌లైసెన్సు ఉండాలి. లేదా ఎక్స్ఎ•-‌లోజివ్‌ ‌లైసెన్సుదారుడితో వర్క్ ఆర్డర్‌ అ‌గ్రిమెంట్‌ ఉం‌డాలి.

అనుభవజ్ఞులైన కార్మికులతో మైనింగ్‌ ‌తవ్వకాలకు రంధ్రాలు (ఘాతాలు) వేయించాలి. బ్లాస్టింగ్‌ ‌చేసే సమయంలో ఫోర్మెన్‌, ‌మైన్‌మేట్‌, ‌బ్లాస్టర్‌ ఆధ్వర్యంలోనే ఇవి చేపట్టాలి. అంతకుముందు సంబందిత మండల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌లేదా సమాన అర్హత కలిగిన రెవెన్యూ అధికారి ఏ మోతాదులో బ్లాస్టింగ్‌ ‌చేస్తున్నారో పరిశీలించి రికార్డు నమోదు చేయాలి. బ్లాస్టింగ్‌ ‌సమయంలో సుమారు 2 కి. వరకు జనసంచారం లేకుండా కట్టడి చేయాలి. ఈ నిబంధనలు మెజారిటీ మైనింగుల్లో అమలు కావడం లేదు.

అంతేగాకుండా బ్లాస్టింగ్‌ అనుమతులు ఉన్న గనులవద్ద పేలుడు పదార్థాల భద్రత, కార్మికుల భద్రతపై పోలీసు, కార్మిక శాఖ తరచూ తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ సపంలో తిరుమలప్లలె సపంలో సర్వే నంబరు 1, 133 పరిధిలో 30 హెక్టార్లలో కడప నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య సతీమణి సి.కస్తూరిబాయి పేరు ద మైనింగ్‌ ‌లీజులు ఇచ్చారు. 2001 నవంబరు 2న 20 ఏళ్లు ముగ్గురాళ్ల తవ్వకం మైనింగ్‌ ‌కోసం అనుమతులు తీసుకున్నారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీతో లీజు గడువు ముగుస్తుంది. 2013లో ఈ మైనింగ్‌ ‌తవ్వకాలకు మైదుకూరు నియోజకవర్గం బి.మఠం అధికార పార్టీ వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డికి జనరల్‌ ‌పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే ఈ గనులను నిర్వహిస్తున్నారు.

వాస్తవంగా 2019 జనవరి 16, అక్టోబరు 19న రెండు పర్యాయాలు కడప గనులు, భూగర్భ శాఖాధికారులు తనిఖీలు చేశారు. మైనింగ్‌ ‌రూల్స్ అతిక్రమిస్తున్నారని, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని షోకాజ్‌ ‌నోటీసు ఇచ్చారు. మైనింగ్‌ ‌నిబంధనలు తు.చ. తప్పకుండా అమలు చేస్తానని జీపీఏ తీసుకున్న నాగేశ్వరరెడ్డి సమాధానమిచ్చారు. అయితే ఎక్కడా ఆయన నిబంధనలు అమలు చేయలేదు. దీంతో కడప అధికారులు ఈ మైనింగ్‌ ‌లీజ్‌ను రద్దు చేయాలని నిరుడు సెప్టెంబరు 20న రాష్ట్ర గనులు, భూగర్భ శాఖకు సిఫారసు చేశారు. ఇక్కడ మైనింగ్‌ ‌కార్యకలాపాలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలసపాడు మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు లేఖ కూడా రాశారు. అయితే లీజు రద్దు చేయలేదు. స్థానిక మండల రెవెన్యూ, పోలీసు అధికారులూ పట్టించుకోలేదు. ఫలితంగా నిబంధనలకు పాతరేసి మైనింగ్‌ ‌సాగిస్తున్నారు.
ముగ్గురాళ్ల పేలుళ్ల ఘటనపై ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గనులు, భూగర్భ శాఖ నుంచి మైనింగ్‌ ‌లీజుకు తీసుకున్న కస్తూరిబాయి..

ఆమె నుంచి మైనింగ్‌ ‌నిర్వహణ కోసం జీపీఏ పొందిన నాగేశ్వరరెడ్డి, క్షేత్రస్థాయిలో మైనింగ్‌ ‌కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన సోదరుడు, వేంప్లలె నుంచి ఏమాత్రం భద్రత లేని వాహనంలో పేలుడు పదార్థాలు రవాణా చేసిన వ్యక్తితో పాటు అనుభవం లేని కూలీలను మైనింగ్‌ ‌కోసం తీసుకొచ్చిన లక్ష్మీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. అయితే లక్ష్మీరెడ్డి అదే ప్రమాద ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్పీ అన్బురాజన్‌ ‌తెలిపారు.

Leave a Reply