Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అం‌దజేత

Study material distribution to students

నర్సంపేట:  మనం – మన ఊరి బడి కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ ‌కన్నె రాజు ఆధ్వర్యంలో గురువారం  ధర్మరావుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటేరియల్‌ అం‌దజేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మరావుపేట గ్రామ సర్పంచ్‌ ‌వెన్ను శృతి పూర్ణ చందర్‌, ‌పాఠశాల ప్రధానోపాధ్యాయులు డేనియల్‌ ‌పాల్‌, ఎస్సెమ్సీ చైర్మన్‌ ‌బెల్లి యకస్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా కన్నె రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతనివ్వాలని ముఖ్య ఉద్దేశంతో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యలో  ముందుండాలని ఉద్దేశంతో  10 వ తర గతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అం‌దించినట్లు ఆయన చెప్పారు. స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ కార్యక్రమం జీవన్‌ ‌వాలంటరీ బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌హనుమకొండ వారి సహకారంతో.విద్యార్థులకు ఉచితంగా అం దించామన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్‌ ‌రెడ్డి, వీరస్వామి, విద్య సొసైటీ ఉపాద్యక్షులు వెన్ను పూర్ణచందర్‌, ‌ప్రధాన కార్యదర్శి తోట రవి, సహా కార్యదర్శి మెడిద అనిల్‌ ‌కుమార్‌, అశోక్‌, ఉపాధ్యాయులు శమంత ,నాగమణి, శ్వేతా, రజియా బేగం, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: manam mana, orru programme, kanne nagaraju

Leave a Reply