Take a fresh look at your lifestyle.

లండన్ లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియాకి రప్పించాలి

  • రాష్ట్ర  ప్రభుత్వం  చొరవ  చూపాలి . 
  • విద్యార్థులకు  అండగా  ఉన్న  తెలంగాణ  ఎన్నారై  ఫోరమ్…మంత్రి హరీష్ రావు చొరవ..
ఎమిరేట్స్, ఇత్హెద్ ఎయిర్ లైన్స్ ల నిర్లక్ష్యం, భారత్ విమాన రాకపోకల రద్దు కారణం గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి 45 మంది విద్యార్థులు లండన్ లో చిక్కుకున్నారు. వారిలో ఎవ్వరికి  ఇప్పుడు ఇల్లు లేదు,  భోజనం లేదు. చివరికి ఇండియన్ హై కమిషన్ లో ఉండగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వారిని కలిసి భరోసా ఇచ్చింది . కొందరికి హోటల్ లో ఉండేందుకు వసతి , భోజనం సౌకర్యం కల్పించింది.
Telangana NRI forum for students ...Minister Harish Rao initiativeవారాంతరం  కారణం అలాగే  దేశ హోం శాఖ కి సంబంధించిన అంశం అవడం వల్ల  సాధ్య సాధ్యాలు పరిశీలన  ని  సమయం పట్టడం తో వారికి  ఇబ్బందులు తప్పడం లేదు ఫోరమ్  ఫౌండర్ గంప వేణుగోపాల్ శిబిరాన్ని సందర్శించి  అందులో  కొందరికి హోటల్ లో బస, భోజనం ఏర్పాట్లు చేసి ధైర్యాన్ని నింపారు, ఇండియన్ ఎంబసీ ఉన్నతాధికారులతో  పరిష్కారంపై చర్చించగా సోమవారం వరకు  ఏమి చెప్పలేమని  తెలిపారు. విద్యార్థులకు ఉండేందుకు వసతి, భోజనం ఏర్పాటు  చేస్తం అన్నా కూడా ఒప్పుకోవడం లేదు హై కమిషన్ లోనే  ఉంటాం  అన్నారు. కొందరిని  ఒప్పించి  హోటల్ లో  చేర్పించడం  జరిగింది.
మంత్రి  శ్రీ  హరీష్  రావు   ద్వారా  పరిష్కారానికి   సంప్రదించడం  జరిగింది  
తెలంగాణ  ఎన్నారై ఫోరమ్ వారికి  అండ గా మేమున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి బెంగ పెట్టుకోవద్దని  భరోసా  ఇస్తుంది. విద్యార్థులకు  అండగా  ఉంటుందని  వారి  కుటుంబ సభ్యులు  దైర్యం గా ఉండాలని  సంఘ ప్రతినిధులు గంప వేణుగోపాల్, ప్రవీణ్  రెడ్డీ,  రంగు  వెంకట్, సుధాకర్  గౌడ్, మహేష్  జమ్ముల, ఆకుల వెంకట్,  మహేష్  చట్ల,  నర్సింహా రెడ్డీ, స్వామి  ఆశ,  అశోక్  మేడిశెట్టి, రవి  కూర సంయుక్త  ప్రకటన లో తెలిపారు.

Leave a Reply