విద్యార్దులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండి పథకాలు సాధించాలని కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఇటీవల శ్రీలహరి క్లాసికల్ డాన్స్ అకాడమి వారు ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్దాయి పోటీలలో కోమురంభీం జిల్లా కౌటాల మండల మయూరి విద్యాలయం మరియు శాంతినికేతం హైస్కూల్ ఈస్గన్ గ్రామ మండల కాగజ్‌నగర్ చెందిన విద్యార్దులు బెస్ట్ స్టేట్ అవార్డు గెలుచుకున్నారు.
అదే విధంగా విద్యార్దులను మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులను మరియు ఇండియన్ మోక్షత డాన్స్ అకాడమి డాన్స్ మాస్టర్ డోంగ్రీ సంతోషంను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్దులకు వచ్చిన స్టార్ అవార్డస్ మరియు సర్టిఫికెట్‌లు అందజేశారు.
Tags: Student, fields including, education, Collector ragiv gandhi hanumanthu,Srilahari Classical Dance Academy