Take a fresh look at your lifestyle.

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పధాన్ని అలవర్చుకొని కలెక్టర్‌ ‌వి.పి.గౌతమ్‌ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ ‌కాలేజ్‌ ‌గ్రౌండ్స్ ‌లో ఇస్రో 50 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వీల్‌ ఆన్‌ ‌స్పేస్‌ ‌ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే స్పేస్‌ ‌రంగంలో భారతదేశం 5వ స్థానంలో ఉండడం మనకు గర్వకారమనమన్నారు. ప్రతి విద్యార్థి మిషన్‌ ‌మంగళ్‌ ‌సినిమాను తప్పకుండా చూసేలా జిల్లా విద్యాశాఖ అధికారి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైన్స్ ‌ప్రదర్శనల ద్వారా స్పూర్తి పొంది ఇకలాజికల్‌ అవగాహన పెంపొందించికోవాలని ఆన్నారు.మహబూబాబాద్‌ ‌కురవి లలో, బుధవారం మరిపెడ, తొర్రుర్‌ ‌లలో స్పేస్‌ ఆన్‌ ‌వీల్‌ ‌బస్సు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లాలోని అందరూ విద్యార్థులు ఈ ప్రదర్శనను చూడాలని, అందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ ‌స్పేస్‌ ఆన్‌ ‌విల్‌ ‌బస్సులో స్పేసుకు సంబంధించిన అంశాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శర్మ జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, వివేకానంద ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply