- ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
వికారాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న బంద్‌ను ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తూ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ కరోనా మహమ్మారి నిర్మూలనకు క ృషిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కరోనాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్, వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట్ లలో కరోనా కేసుల ఎక్కువుగా నమోదు కావడంతో సీఎం కేసీఆర్ ఈ పట్టణాలపై ప్రత్యేక ద ృష్టి పెట్టారని, అందులో భాగంగానే అదనంగా ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ట్యూషన్ ఫీజ్ ఒకేసారి వసూలు చేయకుండా ప్రతి నెల వాయిదా పద్ధతిలో వసూలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ వినే విధంగా చూసుకోవాలని అన్నారు.
పట్టణంలో సీ జోన్లో ఉన్న కాలనీలలో ఇదివరకు ఒక కేసు నమోదై, ప్రస్తుతం కేసులు నమోదు కాకపోతే కాలనీలకు ఏర్పాటుచేసిన కంచెలను తీసివేయాలని అధికారులను కోరారు. కానీ ప్రజలు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదని అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లపైకి రాకూడదని మంత్రి అన్నారు. రైతులు దిగులు చెందవద్దని, వారు పండించే పంటలు వడ్లు, కందులు, శనగలు, జొన్నలు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పూలు అన్నింటినీ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులపై ఏమైనా జులుం చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 18004257462కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్లు మోతీలాల్ చంద్రయ్య, డాక్టర్ అరవింద్, జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా డిఎంహెచ్ ఓ డాక్టర్ దశరథ్, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, వ్యవసాయ అధికారి గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి మాలిని, తదితరులు పాల్గొన్నారు.