Take a fresh look at your lifestyle.

ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత

Students are sick with Food Poison
విద్యార్థులను పరీక్షిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

ధర్మసాగర్‌ ‌మండలం ముప్పారం గ్రామంలోని  కస్తూర్బా పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇందులో 37 మందిని 108 వాహనంలో హుటాహుటిన ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. 10 మందికి ధర్మసాగర్‌ ‌ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో, కొందరికి పాఠశాలలో వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ‌తాటికొండ రాజయ్య ఎంజిఎం హాస్పిటల్‌ ‌సందర్శించి తాను స్వయంగా పిల్లలను పరీక్షించారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించిన అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ పరిస్థితికి కారణాలు తెలుసుకొని వారిపై విచారణ జరిపి, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం ధర్మసాగర్‌లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పిల్లలను, కస్తూరిబా పాఠశాలలో ఉన్న పిల్లలను, పాఠశాల అవరణంను, వంట గదులను, తరగతి గదులను, భోజనశాలను పరిశీలించారు. పిల్లలతో స్వయంగా మాట్లాడి జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. భోజనం, త్రాగునీరు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఇకమీదట ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. ఆయనతో పాటు డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ‌లలితాదేవి, డిఇవో నారాయణరెడ్డి, ఎంపిపి నిమ్మ కవిత, వేలేరు ఎంపిపి కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పిటిసి పిట్టల శ్రీలత, వేలేరు జడ్పిటిసి చాడ చరిత, మార్కెట్‌ ‌కమిటీ వైస్‌ ‌చైర్మన్‌ ‌రాంగోపాల్‌ ‌రెడ్డి, జుబేదా లాల్‌ ‌మహమ్మద్‌, ‌కుడా  అడ్వైసరి డైరెక్టర్‌ ‌బిళ్ళ యాదగిరి, సర్పంచ్‌ ‌గోనెల సమ్మక్క సమ్మయ్య, మార్కెట్‌ ‌డైరెక్టర్‌ ‌కొలిపాక రజిత రమేష్‌, ‌దేవస్థాన డైరెక్టర్‌ ‌సుజాత, ఎంపీటీసీ పొరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్‌, ‌సర్పంచ్‌ ‌శరత్‌ ‌చంద్ర, ఎంపిటిసి బొడ్డు శోభ సోమయ్య, ఎస్‌వో నీరజరెడ్డి, కరుణాకర్‌, ‌బేర్‌ ‌మధుకర్‌, ఎం‌జిఎం వైద్య బృందం, ధర్మసాగర్‌ ‌ప్రైమరీ హాస్పిటల్‌ ‌వైద్య బృందం, మండల నాయకులు ఉన్నారు.

Leave a Reply