Take a fresh look at your lifestyle.

వెలిమెల నారాయణ కళాశాలలో.. విద్యార్థిని ఆత్మహత్య

Student suicide at Welimala Narayana College
పటాన్ చెరు నియోజకవర్గంలోని వెలిమెల గ్రామంలోని    నారాయణ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్ (ఎంపీసీ) ఫస్ట్ ఇయర్ చదువుతున్న సంధ్యా రాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో బాత్ రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
విషయం తెలుసుకున్న యాజమాన్యం నలగండ్లలోని సిటీజన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బీడీఎల్ భానూర్ పోలీసులు తెలిపారు.మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండ గ్రామం వాసిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఎస్. చంద్రశేఖర్  పద్మ వారి కూతురి మరణంతో వారిని దుఃఖసాగరంలోకి ముంచింది.

Leave a Reply

error: Content is protected !!