Take a fresh look at your lifestyle.

అఫ్గాన్‌లో తాలిబన్‌ల భయంతో విద్యార్థినుల రికార్డులు కాల్చివేత

పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వీట్‌
అఫ్ఘాన్‌లో తాలిబన్‌లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లు ప్రకటించారు. వారి భవిష్యత్తు చెరిపేసేందుకు కాదు..వారిని, వారి కుటుంబాలను కాపాడేందుకు మాత్రమే అంటూ అప్గానిస్థాన్‌లోని బాలికల పాఠశాల ’స్కూల్‌ ఆఫ్‌ ‌లీడర్‌షిప్‌’ ‌వ్యవస్థాపకురాలు షబనా బాసిజ్‌ ‌రసిఖ్‌ ‌తెలిపారు. తమ వద్ద చదువుతున్న బాలికలందరి రికార్డులను అగ్నికి ఆహుతి చేశారు.

కాబుల్‌ను మళ్లీ హస్తగతం చేసుకున్న తాలిబన్ల నుంచి, షరియా చట్టాల పేరిట వారు అమలుచేసే కఠినమైన శిక్షల నుంచి బాలికలను కాపాడేందుకే తాను ఇలా చేసినట్టు ఆమె ట్వీట్‌ ‌చేశారు. బాలికల దస్తావేజులను తగులబెడుతున్న దృశ్యాలను కూడా షబనా ఆ ట్వీట్‌కు జత చేశారు.

Leave a Reply