Take a fresh look at your lifestyle.

ప్రత్యక్ష బోధనకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు

  • రెండు మూడు రోజుల్లో విధివిధానాలు
  • హైకోర్టుకు ప్రభుత్వ కార్యదర్శి నివేదిక

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు టీఎస్‌ ‌విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ధర్మాసనం ప్రశ్నించగా రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని హైకోర్టుకు సుల్తానియా వివరించారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌ ‌బోధన కూడా కొనసాగుతుందని తెలిపారు.

విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందిస్తామని సుల్తానియా తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖకు టీఎస్‌ ‌హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply