Take a fresh look at your lifestyle.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే వరకు పోరాటం

polavaram

బూర్గంపాడు: పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని జాతీయ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిరక్షణ సేవాసమితి అధ్యక్షులు చందా లింగయ్య దొర అన్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల పరిధిలో సుమారు మూడు లక్షల మంది గిరిజనులు, లక్షమంది గిరిజనేతరులు పోలవరం నిర్వాసితులగా ఉన్నారని తెలిపారు. నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మార్చి 10న  చలో అమరావతి, 16న చలో హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 20‌న చలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ముంపుకు గురైన భూములకు ఎకరానికి 60 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అమరావతి భూసేకరణలో చెల్లించిన ఈ విధంగా పోలవరం నిర్వాసితులకు చెల్లించాలని పేర్కొన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 10 సెంట్ల స్థలంతో పాటు 25 లక్షల రూపాయలు అందించాలని అన్నారు.

 

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు ,పెళ్లికాని యువతులకు 20 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. గిరిజన సంస్కృతి  సంప్రదాయాలు దెబ్బతినకుండా వారికి గృహాలు నిర్మించాలని పేర్కొన్నారు. నిర్వాసిత గిరిజన కుటుంబానికి ఐదెకరాల భూమి నీ  కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబునల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్వాసిత యువతకు ఉపాధి కోసం ప్రాజెక్టు ప్రాంతంలో జాతీయ పర్యటన కేంద్రంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భద్రాచలం బూర్గంపాడు మండలాల ప్రజలపై ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపిస్తుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో బూసి రెడ్డి శంకర్‌ ‌రెడ్డి, భవనం రాఘవరెడ్డి జ్కం సుబ్రహ్మణ్యం, భూపల్లి నరసింహారావు ,దామెర శ్రీనివాస్‌ ,‌దాసరి సాంబ వెంకటేశ్వర్లు సుబ్బారావు చిచ్చడి శ్రీరామ్‌ ‌మూర్తి ,శ్రీనివాస చారి  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.