Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి పటిష్ట చర్యలు

  • ఢిల్లీ తరవాత రాష్ట్రంలోనే అత్యధిక దవాఖానాల్లో చికిత్స పూర్తి వసతులతో అందిస్తున్నాం
  • తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ‌డా. జీ శ్రీనివాసరావు 

దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా •మ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ‌డా. జీ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల మందికిపైగా •మ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడిం చారు. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా •మ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే ఢిల్లీ తరవాత కొరోనా చికిత్సకు ఎక్కువ ఆస్పత్రులు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వైరస్‌ ‌బాధితుల కోసం నాలుగు దవాఖానల్లో 2501 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేచర్‌ ‌క్యూర్‌, ఆయుర్వేద దవాఖానాల్లో్ల నూ బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. వెయ్యి మందికిపైగా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి టెలిమెడిసిన్‌ ‌సేవలు, వీడియో కాల్‌ ‌ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మార్చి నెలలోనే ముందు జాగ్రత్తలు చేపట్టిందని, ల్యాబ్‌లు, దవాఖానలు ముందుగానే సిద్ధం చేసిందని తెలిపారు. వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందనడానికి ఇవన్నీ దాఖలాలు అన్నారు.

ఇప్పటి వరకు 12 వేల మందిని •ం ఐసోలేషన్‌ ‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌తెలిపారు. ప్రస్తుతం 6552 మంది ఐసోలేషన్‌ ‌లో ఉన్నారని, 785 మంది కొరోనాతో దవాఖానాల్లోల్లో ఉన్నారని చెప్పారు. 246 మంది అనుమానితులు కూడా దవాఖానాల్ల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్‌ ‌లాక్‌ -2 ‌లో అన్ని ఓపెన్‌గా ఉన్నాయని, ఇపుడు ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. జూన్‌ ‌నెలలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని శ్రీనివాస్‌ ‌చెప్పారు. వెంటిలేటర్‌ అవసరం అయిన వారు చాలా అరుదని డీఎంఈ రమేష్‌ ‌రెడ్డి చెప్పారు. గాంధీలో ప్రస్తుతం 812 కేసులు ఉంటే అందులో 6 నుంచి 7 మాత్రమే వెంటిలేటర్‌ అవసరం అవుతోందని ఆయన తెలిపారు. నగరంలో ఆక్సిజన్‌, ‌జిల్లా దవాఖానాల్లో నూ ఆక్సిజన్‌ ‌సప్లై పెంచుతున్నామని, ఇటీవల కేసులు భారీగా పెరుగుతున్నాయని, అలాంటి కేసులను ఉస్మానియా, చెస్ట్ అప్సత్రుల్లో చికిత్స అందిస్తున్న రమేష్‌ ‌చెప్పారు. మరికొన్ని రోజుల్లో అధునాతన పరికరాలను టెస్టింగ్‌ ‌కోసం అందుబాటులోకి తెస్తున్నామని, ప్రైవేట్‌ ‌లాబ్స్‌లో దవాఖానాల్లో డేటా సరిగా లేదని గుర్తించ్చామని, ఒక్కో పోర్టల్లో ఒక్కో లాగా అప్‌లోడ్‌ ‌చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎక్స్ ‌ఫర్ట్ ‌కమిటీ ప్రైవేట్‌ ‌లాబ్స్ ‌ఫలితాలను పరిశీలిస్తోందని, కొన్ని లాబ్‌ ‌లలో సరైన పద్ధతుల్లో పరీక్షలు చేయడం లేదని, అలాంటి వారికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. తెలంగాణలో 23 ప్రైవేట్‌ ‌ల్యాబ్‌ల్లో కొరోనా టెస్టులు చేస్తున్నారని, 13 ల్యాబ్‌ల్లో అబ్‌నార్మల్‌ ‌రిపోర్టస్ ‌వస్తున్నాయని, 13 ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చామని, రాబోయే రోజుల్లో.. ప్రైవేట్‌ ‌ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకోకపోతే మూసి వేస్తామని వైద్య అధికారి హెచ్చరించారు.
-శ్యామ్‌

Leave a Reply

error: Content is protected !!