Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో పటిష్టంగా సేవలు

సిబ్బంది కొరత లేకుండా చూడాలి : మంత్రి ఆళ్ల నాని
విశాఖపట్నం : కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం సక్ష నిర్వహించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్‌ ‌సరఫరాను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. ఏపీకి అదనంగా 230 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌రానుందని వెల్లడించారు.

వ్యాక్సిన్‌ ‌కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇదిలావుంటే కరోనా నివారణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, రోగులకు బెడ్‌ ‌లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్‌ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారాలకు కల్పించినట్లు గుర్తుచేశారు.

ఆక్సిజెన్‌ ‌కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 1,443 ఆరోగ్య శ్రీ బెడ్‌లు ఉండగా వీటిని పెంచే యోచనలో ఉన్నాం. హెల్త్ ‌కేర్‌ ‌వర్కర్స్ అం‌దరికీ పీపీ కిట్‌, ఎన్‌-95 ‌మాస్కులు అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలి. కేంద్రం నుంచి దశల వారీగా వ్యాక్సిన్‌ ‌వస్తోంది. అందరికీ వ్యాక్సిన్‌ ‌వేయడం జరుగుతుంది. జిల్లాలో 46 వేల మంది ఇటీవల కోవిడ్‌తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వ్యక్తులు కోలుకుంటున్నారు.’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌వెల్లడించారు.

Leave a Reply