Take a fresh look at your lifestyle.

రాత్రి వేళ పటిష్టమైన పోలీసు నిఘా

ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, నైట్‌ అలర్టింగ్‌ ‌పోలీసు ఆఫీసర్లను పెంచనున్నట్లు జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీలను పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహిస్తు అనుమానితులను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ ‌నిర్వహించి అనుమానితుల యొక్క వేలిముద్రలను సేకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే నిబంధనలు పాటించని దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. వాహనదారులపై ఈ చాలనా కేసులు నమోదు చేస్తున్నామని, గురువారం రాత్రి 200పైగా ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిం దని వెల్లడించారు. అలాగే రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్‌ ‌నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply