Take a fresh look at your lifestyle.

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌..

72 ‌గంటల సమ్మెకు పలు కార్మిక సంఘాల మద్దతు – కార్మిక సంఘాలు, కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెకు మద్దతు సంస్థకు రూ. 159 కోట్ల నష్టం, వేతనాల ద్వారా కార్మికులకు రూ. 69కోట్ల నష్టం

గోదావరిఖని,: నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు, యైటింక్లయిన్‌కాలనీ : విజయ చిహ్నం చూపిస్తున్న టిబిజికెఎస్‌ ‌నాయకులు, యైటింక్లయిన్‌కాలనీ : సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మి••సంఘం నేతలు:కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని , బొగ్గు పరిశ్రమను ప్రైవేట్‌ ‌పరం చేయడంతో కార్మిక దోపిడికీ పాల్పడడాన్ని నిరసిస్తూ పలు జాతీయ సంఘాలతో పాటు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ ‌గురువారం సమ్మెలో పాల్గొన్నది. 2 నుండి 4 వ తేది వరకు 72 గంటల నిరవధిక సమ్మెలో బీజేపీ అనుబంధ బీఎంఎస్‌తో పాటు సీఐటీయూ,ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ సంస్థలు పాల్గొంటున్నాయి. కాగా టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌ ‌కేవలం 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నది. మొదటి రోజు సమ్మె నేపథ్యంలో రామగుండం రీజియన్‌ 1,2,3 ‌లలోని కార్మికులకు తమ విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా 46వేల మంది కార్మికులు సమ్మెకు పూనుకోవడంతో 26 భూగ్భ గనులు, 18 ఉపరితల బావుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి సంస్థకు రూ. 159 కోట్లు నష్టం కాగా కార్మికులకు వేతనాల రూపంలో రూ. 69 కోట్ల నష్టం వాటిల్లుతున్నది.

బొగ్గు బావుల వద్ద కార్మి••సంఘాల నిరసనల హోరు
ఉపరితల బొగ్గు గనులు, భూగర్భ గనుల వద్ద అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ ‌చేశారు. స్వదేశీ పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, సెంటిమెంట్‌పేరుతో అధికారంలోకి వచ్చిన టీబీజీకేఎస్‌ ‌రెండూ కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నదని టీబీజీకేఎస్‌ను విమర్శించారు. కంటి తుడుపు చర్యగా 24 గంటల సమ్మె మాత్రమే చేసి మిగతా రోజుల్లో యాజమాన్యంకు సహకరిస్తున్నదా అని ప్రశ్నించారు. బొగ్గు బావు)వద్ద కాకుండా గోదావరిఖని, సెంటినరీ కాలనీ, యైటింక్లయిన్‌ ‌కాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ళలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తంచేస్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

సింగరేణి ఆర్జీ2 ఏరియాలో సమ్మె విజయవంతం
యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి ఆర్జీ2 ఏరియాలో సమ్మె విజయవంతమైనట్లు గుర్తింపు కార్మిక సంఘం టిబిజికెఎస్‌ ‌నాయకులు తెలిపారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం చేస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టిబిజికె ఎస్‌ ‌గౌరవ అధ్యక్షురాలు కె.కవిత, అధ్యక్షులు బి.వెంకట్రా వు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్జీ2 ఏరియాలోని అన్ని గనులు, విభాగాలలో గురువారం సమ్మె విజయవంతం అయిందని నాయకులు తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు టిబిజికెఎస్‌ ‌నాయకులు అన్ని గనులు, విభాగాలను సందర్శించారు.. ఈ కార్యక్ర మంలో ఆర్జీ2 ఉపాధ్యక్షులు అయిలి శ్రీనివాస్‌, ‌నాయకులు దేవ వెంకటేశం, సత్యనారాయణ రెడ్డి, బేతి చంద్రయ్య, నాయిని మల్లేష్‌, ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఐ.సత్యం, ప్యారేమియా, ఆవునూరి రాజేశం, కర్క శ్రీనివాస్‌, ఆకుల రాజయ్య, మురళి, రవీందర్‌, అం‌జయ్య తదితరులు పాల్గొన్నారు.

సమ్మెలో పాల్గొన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు
సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసి ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసి నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కోల్‌ఇం‌డియాలో మాదిరిగా హైపవర్‌ ‌కమిటీ వేతనాలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కాంట్రా క్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 7శాతం పెన్షన్‌ ‌సమస్యను వెంటనే పరిష్కరించాలని, కార్మికులకు, వారి కుటుంబీకులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాల ని, సిఎంపిఎఫ్‌, ‌బ్యాంకు వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఖాళీ క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని, పండుగ సెలవులు, లీవులు చట్టబద్ద హక్కులు అమలు చేయాలని, ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే కోటి రూపాయలు చెల్లించి పర్మినెంట్‌ ఉద్యోగు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఐఎఫ్‌టియు అధ్యక్షులు ఏ.వెంకన్న, నాయకులు ఎస్‌.‌రజిత, ఎస్‌.‌మనోజ్‌, ‌కె.మోహన్‌, ఎస్‌,‌రమేష్‌, ఎస్‌.‌లక్ష్మి, ఆర్‌.‌మోహన్‌, ‌చొక్కారావు, పి.రమేష్‌, ‌నాగరాజు, సావిత్రి, అరుణ, టి.రాయమల్లు పాల్గొన్నారు.

 

Leave a Reply

error: Content is protected !!