Take a fresh look at your lifestyle.

విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌లో సమ్మె సైరన్‌

యాజమాన్యానికి ఉక్కు పరిరక్షణ జేఏసీ నోటీసులు
‌విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌లో సమ్మె సైరన్‌ ‌మోగింది. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. తమ పోరాటాన్ని కార్మికులు ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగానే యాజమాన్యానికి ఉక్కు పరిరక్షణ జేఏసీ నోటీసులు అందజేసింది. ఉక్కు ప్రయివేటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. ఈనెల 25 తరువాత సమ్మెకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించాయి. నిబంధనల ప్రకారం సమ్మెకు 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

దశల వారీ ఆందోళనలో భాగంగా సమ్మె అస్త్రాన్ని కార్మిక సంఘాలు సంధించాయి. అలాగే, ఈనెల 17న అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, మార్చి 20న కష్ణా గ్రౌండ్స్ ‌లో బహిరంగ సభకు సిద్ధం అయ్యాయి. ఇక మరో వైపు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌కోసం కదులుతున్నాయి. ఈ తరుణంలో.. తెలంగాణ నుంచి కూడా విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పోరాటానికి మద్దతు లభించింది. విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్‌ ‌పరం చేశారని ఫైర్‌ అయిన కేటీఆర్‌.. ‌విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.. వీలైతే విశాఖకు వెళ్లి స్టీల్‌ ప్లాంట్ ‌ ఉద్యమంలో పాల్గొంటామని.. పోరాటంలో కలిసి ఉంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply