- 22 ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
- చెక్కుల క్లియరెన్స్, ఏటిఎం, ఆన్‌లైన్‌బ్యాంకింగ్‌పై ప్రభావం
- ఉభయరాష్ట్రాలలో 7726శాఖల ఉద్యోగులు సమ్మెలో
ప్రజాతంత్రప్రతినిధి, హైదరాబాద్: దేశంలోని 22 ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులు శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. శనివారం కూడా ఈ సమ్మె కొనసాగనున్నది. ఏపి తెలంగాణలోని 7726బ్యాంకులలో లావాదేవీలు స్థంభించాయి. తెలంగాణలో 35వేల మంది ఉద్యోగులు సమ్మెశంఖం పూరించి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఉద్యోగులందరికీ రెండు సంవత్సరాలుగా బకాయి పడిన వేతన సవరణను వెంటనే చెప్పటాలని, 20శాతం మేరకు వేతనాలను సవరించాలని, ప్రత్యేకభత్యాన్ని మూలవేతనంతో కలపాలని, ఐదురోజుల పనిదినాలను అమలులోకి తీసుకరావాలని, ఫ్యామిలీ పెన్షన్ 15శాతానికి పెంచాలని, వేతన సవరణను రెండు సంవత్సరాలుగా వాయిదావేస్తూ వస్తున్న ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగబ్యాంకు ఉద్యోగుల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సారథ్యంలోని బ్యాంకు సంఘాలన్నీ ధ్వజమెత్తాయి.
తమ డిమాండ్‌ల సాధనకోసం అవసరమయితే ఏప్రిల్ నిరవధిక సమ్మె చేస్తామని, తెలంగాణ రాష్ట్ర బ్యాంకు సంఘాల కన్వీనర్ చుక్కయ్య, తెలంగాణ ఆంధ్రాబ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు జి, బక్కయ్య పేర్కొన్నారు.సెంట్రల్ లేబర్ కమిషనర్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతోనే సమ్మెకు పిలుపునిచ్చామని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘాలసమాఖ్య ప్రధానకార్యదర్శి ఎం.ఎస్.కుమార్ తెలిపారు.తెలంగాణ ఆంధ్రారాష్ట్రాలలో చెక్కుల క్లియరెన్స్‌పైన,ఏటిఎంలు, ఆన్‌లైన్‌బ్యాంకింగ్‌లపై ఈ సమ్మె ప్రభావం చూపింది. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
Tags: ATMs and online banking,check clearance,Andhra Pradesh