Take a fresh look at your lifestyle.

నగర అభివృద్ధి కోసం అవసరమైతే కఠిన చర్యలు

  • మున్సిపల్‌ ‌మంత్రి కేటీఆర్‌
  • ‌శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ

నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి మంత్రి కేటీఆర్‌ , ‌మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌ ‌తో కలిసి, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా కొండాపూర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలోని దుర్గం చెరువు పై ప్రాజెక్ట్ ‌కింద నిర్మిస్తున్న తీగల వంతెన (కేబుల్‌ ‌బ్రిడ్జి ) నిర్మాణ పనుల స్థితిగతులను మంత్రి కేటీఆర్‌ ‌పరిశీలించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ, అభివృద్ధి పనుల పురోగతి వివరాలను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మరియు పలు సూచనలను తెలియజేసారు. , అవసరమైన వద్ద కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వెనుకాడకూడదని భూసేకరణలో తీసుకోవలసిన చర్యలను త్వరిత గతిన తీసుకోవాలని ప్రజా సౌకర్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. ఈ సందర్బంగా,స్థానిక ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లుగా ఉన్న ట్రాఫిక్‌ ‌సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ ఫ్లై ఓవర్‌ ‌పనిచేస్తుందని ,ఇకనుండి ప్రజలకు ట్రాఫిక్‌ ‌సమస్య కష్టాలు తీరుతాయి అని , ప్రజలకు మెరుగైన ,సుఖవంతమైన ,ట్రాఫిక్‌ ‌రహిత ప్రయాణం అందిస్తామని తెలిపారు. అడ్డుగా ఉన్న హైటెన్షన్‌ ‌టవర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి బ్రిడ్జి నిర్మాణ పనులకు సహకరించాలని విద్యుత్‌ అధికారులను కోరారు.

అదేవిదంగా నియోజకవర్గ ప్రజల సౌకర్యర్థం నిర్మిస్తున్న పలు ప్రత్యామ్న్యాయ రహదారి నిర్మాణ పనుల పురోగతిని జిహెచ్‌ఎం‌సీ మేయర్‌ , ‌ప్రిన్సిపాల్‌ ‌సెక్రటరీ తో కలిసి పరిశీలించారు. కేపీహెచ్బీ వద్ద నిర్మిస్తున్న రోడ్డు అండర్‌ ‌బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం భారి బడ్జెట్‌ ‌తో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ‌సిటీ ప్లానర్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డి, సీఈ ప్రాజెక్టస్ ‌శ్రీధర్‌ ‌జోనల్‌ ‌కమిషనర్‌ ‌రవి కిరణ్‌, ‌జోనల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీమతి మమతా మరియు జీహెచ్‌ఎం‌సి అధికారులు, విద్యుత్‌ ‌శాఖ అధికారులు, మరియు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply